Saturday, January 18, 2025
HomeTrending Newsహీరో నాగార్జున 'ఎన్ కన్వెన్షన్' కూల్చివేత

హీరో నాగార్జున ‘ఎన్ కన్వెన్షన్’ కూల్చివేత

హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది. నాళాలు, చెరువులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తోంది. తాజాగా మాదాపూర్ లో సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా  కూల్చివేస్తోంది. భారీ భద్రతా మధ్య ఆరు భారీ క్రేన్లతో హైడ్రా ఈ కూల్చివేత మొదలు పెట్టింది. తెల్లవారుజామున మొదలైన ఈ ప్రక్రియ మరికాసేపట్లో పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.

ఎన్ కన్వెన్షన్ పై గత బిఆర్ఎస్ ప్రభుత్వంలోనూ పలు ఫిర్యాదులు అందాయి.  తమ్మిడి చెరువును కబ్జా చేసి నిర్మించారని ఆరోపణలు. దాదాపు  మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్‌ నిర్మించారని జ‌నం కోసం సంస్థ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైడ్రా ఆక్రమణ ఉన్నట్లు నిర్ధారించి తదనుగుణంగా చర్యలు చేపట్టింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్