Saturday, January 18, 2025
Homeసినిమాఆ సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చేసిన నాని!

ఆ సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చేసిన నాని!

చిన్నచిన్న పాత్రలను పోషిస్తూ వెళ్లి, సరైన పాత్ర పడినప్పుడు ఒక్కసారిగా స్టార్ డమ్ ను దక్కించుకున్న వారు ఉన్నారు. అలాగే ఒకే ఒక్క సినిమాతో హీరోగా ఎదిగిపోయినవారు ఉన్నారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొత్త దర్శకులు ఉన్నారు. కానీ వీళ్లందరికీ భిన్నంగా సంచలనాన్ని సృష్టించిన దర్శకుడు ‘బలగం’ వేణు. నటుడిగా కొన్నేళ్ల పాటు చిన్నచిన్న రోల్స్ చేస్తూ, తాను తయారు చేసుకున్న కథతో ఒక ప్రభంజనాన్ని సృష్టించాడు. అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకునేలా చేశాడు.

పడిపోతున్న కుటుంబ విలువలు .. కూలిపోతున్న బంధాలు .. అనుబంధాల నేపథ్యంలో అల్లుకున్న ఈ కథ ఒక్కసారిగా అందరినీ ఆలోచింపజేసింది. పాత రోజుల్లో మాదిరిగా ఊరూరా ప్రత్యేకమైన స్క్రీన్లు ఏర్పాటు చేసుకుని, ప్రజలంతా కలిసి చూసిన సినిమాగా ఇది చరిత్ర సృష్టించింది. అలాంటి వేణు ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం కథానాయకుడిని సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు.

నానీతో వేణు సినిమా ఉంటుందనే టాక్ వచ్చింది. దిల్ రాజు బ్యానర్లో ఈ సినిమా ఉంటుందని చెప్పుకున్నారు కూడా. అయితే ఈ ప్రాజెక్టు ప్రస్తావన ఎక్కడా లేకపోవడంతో, ఇక ఉండదేమోనని అనుకున్నారు. కానీ తమ కాంబినేషన్ లో సినిమా ఉంటుందనీ, అది కూడా దిల్ రాజు బ్యానర్లోనే ఉంటుందని తాజా ఇంటర్వ్యూలో నాని క్లారిటీ ఇచ్చేశాడు. మొత్తానికి ఈ ప్రాజెక్టు అయితే ఉందన్నమాట. కాకపోతే ఎప్పుడు మొదలవుతుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్