Thursday, March 19, 2026
Homeసినిమానితిన్ మూవీ టైటిల్ మారిందా..?

నితిన్ మూవీ టైటిల్ మారిందా..?

హీరో నితిన్,కథా రచయిత వక్కంతం వంశీతోను సినిమాలు చేస్తున్నాడు. గతంలో అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య .. నా ఇల్లు ఇండియా’ సినిమా చేసిన వక్కంతం, చాలా గ్యాప్ తరువాత మరోసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు. కథా రచయితగా మంచి పేరున్న వంశీపై నమ్మకంతో నితిన్ ఛాన్స్ ఇచ్చాడు.నిఖిత రెడ్డి – సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ షూటింగు జరుపుకుంది. ఈ సినిమాలో నితిన్ జోడీగా శ్రీలీల కనిపించనుంది. ఈ సినిమాకి ‘జూనియర్’ అనే టైటిల్ ను అనుకున్నారు. అయితే ఆ టైటిల్ అంత ఎఫెక్టివ్ గా అనిపించడం లేదని చెప్పి పక్కన పెట్టేశారనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాకి ‘ఎగస్ట్రా’ అనే టైటిల్ ను సెట్ చేశారట. ట్యాగ్ లైన్ గా ‘ఆర్డినరీ మేన్’ అనేది ఉంటుంది. అంటే మొత్తంగా చూసుకుంటే ‘ఎక్స్ ట్రార్డినరీ మేన్’గా అనిపిస్తుందన్న మాట. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాకి టైటిల్ కూడా డిఫరెంట్ గానే ఉండేలా ఇలా ప్లాన్ చేశారని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular