Wednesday, May 29, 2024
Homeసినిమాఅల్లు అర్జున్ తో అనుకుంటే.. నితిన్ తో సెట్ అయ్యిందా... ?

అల్లు అర్జున్ తో అనుకుంటే.. నితిన్ తో సెట్ అయ్యిందా… ?

ఇండస్ట్రీలో ఒక హీరో కోసం కథ రాస్తే.. మరో హీరోకి సెట్ అవ్వడం జరుగుతుంటుంది. నాటి నుంచి నేటి వరకు ఇలా ఎన్నో జరిగాయి. అయితే.. ఇప్పుడు  అల్లు అర్జున్ కోసం కథ రాస్తే.. నితిన్ కి సెట్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే… అల్లు అర్జున్ కోసం డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఓ కథ రెడీ చేశారు. అదే.. ఐకాన్. కనపడడం లేదు అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాలి అనుకున్నారు. అనుకోవడమే కాదు.. అఫిషియల్ గా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేయడం కూడా జరిగింది.

ఇదంతా పుష్ప సినిమా టైమ్ లో జరిగింది. పుష్ప రిలీజ్ తర్వాత బన్నీ ఇమేజ్ అమాంతం పెరిగింది. దాంతో బన్నీ ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారు. కథ బాగా నచ్చింది.. ఖచ్చితంగా సినిమా చేస్తానని బన్నీ మాట ఇవ్వడంతో డైరెక్టర్ వేణు శ్రీరామ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేశాడు కానీ.. బన్నీ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. మరో వైపు బన్నీ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. అలాగే సందీప్ రెడ్డితో సినిమా కూడా కన్ ఫర్మ్ చేశాడు. ఈ సినిమాలు పూర్తవ్వాలి అంటే.. ఇంచుమించు మూడు సంవత్సరాలు పట్టచ్చు.

అందుకనే ఇక లాభం లేదనుకుని వేణు శ్రీరామ్ నితిన్ తో సినిమా చేయాలని ప్రయత్నం ప్రారంభించాడట. ఈ కథ విన్న వెంటనే నితిన్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. దిల్ రాజు బ్యానర్ లో నితిన్ దిల్, శ్రీనివాస కళ్యాణం సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాల్లో దిల్ సక్సెస్ కాగా, శ్రీనివాస కళ్యాణం ఫ్లాప్ అయ్యింది. ఈసారి ఎలాగైనా సరే.. సక్సెస్ సాధించాలనే పట్టుదలతో టీమ్ వర్క్ చేస్తున్నారట. త్వరలోనే ఈ చిత్రాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్