హీరో రామ్, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి అసలు ఈ కథ ఏంటి? ఇందులో రామ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా స్టోరీ గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఏంటంటే.. ఇదొక పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. పైగా సినిమాలో చాలా భాగం కేరళ నేపథ్యంలో సాగుతుందట. ముఖ్యంగా రామ్.. అయ్యప్ప భక్తుడిగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడని.. రామ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. రామ్ చేయనున్న రెండు పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయని టాక్.
రామ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో బోయపాటి ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట. అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ కూడా ఈ సినిమా పై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. మరి.. రామ్, బోయపాటి కలిసి ఏ స్థాయి విజయాన్ని సాధిస్తారో చూడాలి.
Also Read : రామ్ మూవీలో బాలీవుడ్ హీరో?