Wednesday, June 17, 2026
Homeసినిమామావయ్య ఆ మాట అనేసరికి నమ్మలేకపోయాను: సాయితేజ్ 

మావయ్య ఆ మాట అనేసరికి నమ్మలేకపోయాను: సాయితేజ్ 

చాలా గ్యాప్ తరువాత ‘విరూపాక్ష’ సినిమాతో వచ్చిన సాయితేజ్, ఆ సినిమాతో హిట్ కొట్టాడు. ఆ తరువాత సినిమాగా ఆయన చేసినదే ‘బ్రో’. పవన్ కల్యాణ్ తో కలిసి ఈ సినిమాలో ఆయన నటించాడు. నిన్నరాత్రి జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో ఆయన మాట్లాడుతూ .. “ఒక రోజున కల్యాణ్ మావయ్య కాల్ చేసి .. ‘నువ్వొక సినిమా చేయాలిరా’ అన్నారు. ‘చేస్తాను మావయ్య’ అన్నాను. ‘ఇది మల్టీస్టారర్ మూవీరా .. నువ్వు  మెయిన్ లీడ్ చేయాలి .. నేను ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాను’ అన్నారు. ఆ మాటలను నేను నమ్మలేకపోయాను. నన్ను ఆటపట్టిస్తున్నారని  అనుకున్నాను” అని అన్నాడు.

“ఆ తరువాత కల్యాణ్ మావయ్య రమ్మన్న చోటుకు వెళ్లి కలిశాను. ఫోన్లో చెప్పిన విషయాన్నే ఆయన అక్కడ చెప్పారు. నేను కూడా మావయ్యకి అభిమానినే .. అందువల్లనే నేను చేయలేనని అంటే ఒప్పించారు. ఆ తరువాత సముద్రఖని గారు నాకు కథ చెప్పారు. ఈ ప్రాజెక్టులో ఈ పాత్రను నేను చేయాలనే నిర్ణయం, నాకు ప్రమాదం జరగడానికి ముందే జరిగిపోయింది. ఆ సమయంలో హాస్పిటల్లో ఉన్న నా దగ్గరికి ప్రతి రోజు మావయ్య వచ్చి నాకు ధైర్యం చెప్పి వెళ్లేవారు. ఇక ఈ సినిమా అంతా రెడీ అయ్యాక నాకు అసలు విషయం చెప్పారు” అని అన్నాడు.

‘బ్రో’ సినిమా విషయానికి వస్తే .. ఈ సినిమా మీ అంచనాలకి మించి ఉంటుంది. మెగా అభిమానులంతా ఈ సినిమా చూసి కాలర్ ఎగరేసుకుంటూ వెళుతుంటారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఇంతకుముందు మేనమామ – మేనల్లుడు కాన్సెప్టుతో ‘వెంకీమామ’ చేశారు. అలాగే మళ్లీ ఇప్పుడు ఈ సినిమాతో ఈ మేనమామ – మేనల్లుడిని కలిపారు. ఈ సినిమా నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. సముద్రఖని గారు ఏదైతే చెప్పారో .. అదే తీశారు. ఆయన దర్శకత్వంలో .. మావయ్య కాంబినేషన్లో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇందుకు కారణమైన త్రివిక్రమ్ గారికి నేను రుణపడి ఉంటాను” అని చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular