Wednesday, May 8, 2024
Homeసినిమాశ్రీ‌కాంత్ చేతుల మీదుగా రోహిత్ `క‌ళాకార్` ఫ‌స్ట్ లుక్ రిలీజ్

శ్రీ‌కాంత్ చేతుల మీదుగా రోహిత్ `క‌ళాకార్` ఫ‌స్ట్ లుక్ రిలీజ్

‘6 టీన్స్‌’, ‘జానకి వెడ్స్‌ శ్రీరామ్‌’, ‘నేను సీతామాలక్ష్మి’, ‘శంక‌ర్‌దాదా MBBS’, ‘నవ వసంతం`వంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో రోహిత్‌. ప్ర‌స్తుతం ఆయ‌న‌ హీరోగా శ్రీను బందెల దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `కళాకార్‌`. ఏజీ అండ్‌ ఏజీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్న ఈ చిత్రంలో షాయాజీ షిండే, పృథ్విరాజ్‌, రాజీవ్‌ కనకాల, శివశంకర్‌, రవికాలే, గగన్‌, కరాటే కళ్యాణి, జయలలిత, అశోక్‌కుమార్ వంటి ప్ర‌ముఖ న‌టులు కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ ను హీరో శ్రీ‌కాంత్ రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా.. హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ.. “రోహిత్ నేను క‌లిసి ఎప్ప‌టినుండో ఇండ‌స్ట్రీలో ట్రావెల్ చేస్తున్నాము.  ఆయ‌న మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్  టు రోహిత్ అండ్ టీమ్‌” అన్నారు.

హీరో రోహిత్ మాట్లాడుతూ… “ క‌ళాకార్ మూవీ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ హీరో శ్రీ‌కాంత్ గారు రిలీజ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఆయ‌న‌తో ఎప్ప‌టి నుంచో నాకు మంచి అనుబంధం ఉంది. నేను ఫస్ట్‌ టైమ్‌ యాక్ష‌న్ అండ్ స‌స్పెన్స్ సబ్జెక్ట్ తో చేస్తోన్న చిత్ర‌మిది. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌. సినిమా చాలా బాగా వచ్చింది. త‌ప్ప‌కుండా మీ అంద‌రికి న‌చ్చుతుంది” అన్నారు. చిత్ర నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం  దర్శకుడు శ్రీను బందెల ఈ కార్యక్రంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్