Tuesday, March 10, 2026
Homeసినిమాథియేటర్ బిజినెస్ లోకి విజయ్ దేవరకొండ  

థియేటర్ బిజినెస్ లోకి విజయ్ దేవరకొండ  

సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అంచెలంచెలుగా ఎదుగుతూ యూత్ కు ఇన్సిపిరేషన్ గా నిలుస్తున్నారు. ఇప్పటికే రౌడీవేర్, ప్రొడక్షన్ హౌస్, ఎలక్ట్రిక్ వెహికిల్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఇప్పుడు థియేటర్ రంగంలోకి అడుగుపెట్టాడు. ప్రేక్షకులకు టాప్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ ని అందించేందుకు డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిషన్,థియేటర్ రంగాల్లో సుదీర్ఘ అనుభవాన్ని సొంతం చేసుకున్న ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంలో ఏ.వి.డి సినిమాస్ పేరుతో తన సొంత ఊరు మహబూబ్ నగర్ లో థియేటర్ ఓపెన్ చేశాడు.

డాల్బీ అట్మాస్, లగ్జరీ సీటింగ్ వంటి అధునాతన హంగులతో అత్యుత్తమ థియేటర్ అనుభవాన్ని ప్రేక్షకులకు అందించనుంది ఎవిడి సినిమాస్. ఈ సందర్భంగా  జయ్ తండ్రి గోవర్ధన్ రావు దేవరకొండ మాట్లాడుతూ… “మేము పుట్టి పెరిగిన చోట ఇలాంటి మల్టిప్లెక్స్ నిర్మాణంలో భాగం అవడం చాలా సంతోషంగా ఉంది. విజయ్ కి ఈ మల్టి ప్లెక్స్ చాలా స్పెషల్. ఏషియన్ సునీల్ గారి భాగస్వామ్యం మాకు చాలా ఆనందకరంగా ఉంది. టాప్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ ఇక్కడ దొరుకుతుంది.అందరూ దీన్ని ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.

ఏషియన్ సినిమాస్ అధినేత నారాయణ దాస్ నారంగ్ మాట్లాడుతూ “ సినిమా ప్రేక్షకులకు ఓ మంచి అనుభూతి అందించేందుకే మహబూబ్ నగర్లో ఏ.వి.డి సినిమాస్ ను నిర్మించాము. మాతో భాగస్వామ్యం అయిన హీరో విజయ దేవరకొండ కు కృతజ్ఞతలు. మహబూబ్ నగర్ కే కాదు , చుట్టుపక్కల జిల్లాలకు కూడా ఏ.వి.డి ఎంటర్టైన్మెంట్ హబ్ అవుతుంది” అన్నారు.

ఏషియన్ సునీల్ నారంగ్ మాట్లాడుతూ ”ఏ.వి.డి సినిమాస్ లో ప్రదర్శించే మొదటి సినిమా మా సంస్థ నిర్మించిన ‘లవ్ స్టోరి’ కావడం చాలా ఆనందంగా ఉంది. మెట్రో సిటీస్ లో పొందే థియేటర్ ఎక్స్ పెరియన్స్ కి ధీటుగా ఈ మల్టీప్లెక్స్ ను నిర్మించాము..ఇది తప్పకుండా మహబూబ్ నగర్ కి ఎంటర్టైన్మెంట్ హబ్ అవుతుంది.’’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular