Thursday, March 28, 2024
HomeTrending Newsరైతన్నకు తోడుగా కృత్రిమ మేధ

రైతన్నకు తోడుగా కృత్రిమ మేధ

ఎస్ఆర్ఐ ఇంటర్నేషనల్ (గతంలో స్టాన్ ఫోర్డ్ రీసెర్చ్ ఇనిస్టి ట్యూట్) మూలాలు కలిగిన ఇన్సూర్ టెక్ వెంచర్ వింగ్ స్యూర్ తో తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా రైతులను కాపాడేందుకు కృత్రిమ మేధను, లోతైన సాంకేతికతను వినియోగిస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా వింగ్ స్యూర్ సాంకేతిక ఆధారంగా వ్యక్తిగతీకరించబడిన పంట బీమా ఉత్పాదనలను, సలహా సేవలను చిన్న రైతులకు అందించనుంది. ఈ తరహా ఒప్పందాల్లో ఇదే మొదటిది. ఇది సామాజిక చేకూర్పును అందించడంలో, భారతీయ వ్యవసాయంలో డిజిటల్ పరివర్తనలో తెలంగాణను ముందువరుసలో నిలబెట్టనుంది. మొత్తం మీద ఇది ఆర్థిక సాధికారికత, కలసి పని చేసే అవకాశాలు, వాల్యూ చెయిన్ లో వినూత్నత, వృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వ ఆశయాలకు అండగా నిలువనుంది.

రాష్ట్ర ప్రభుత్వ విభాగమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ (ఐటిఇ అండ్ సి) పర్యవేక్షణలో వ్యవసాయ విభాగం దీన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయనుంది. ఈ కార్యక్రమం కింద రైతులకు అవసరమైన శిక్షణ, సలహా సేవలను సంస్థ రైతులకు అందిస్తుంది. అదే విధంగా సమాచార సేకరణ, ఇతర కార్యకలాపాలను నిర్వర్తించనుంది. దానికి తోడుగా, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రకల్చరల్ యూనివర్సిటీ పరిశోధన కేంద్రాలు ఆయా పంటలకు, శీతోష్ణస్థితి పరిస్థితులకు సంబంధించి సలహాలు, సూచనలను వింగ్ స్యూర్ వేదిక ద్వారా అందించను న్నాయి.

భారతదేశంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు జీవనోపాధులకు అతిపెద్ద వనరులుగా ఉన్నాయి. గ్రామీణ కుటుంబాల్లో అత్యధికం ప్రాథమికంగా వ్యవసాయంపైనే ఆధారపడ్డాయి. 70 శాతం కమతాలు చిన్న, సన్నకారు రైతులకు చెందినవే. చాలా మంది రైతులు శీతోష్ణస్థితి మార్పు ప్రభావాలకు లోనయ్యే ముప్పును ఎదుర్కొంటున్నారు. ముప్పులపై అవగాహన కార్యక్రమాలు, ఆధునిక వనరులు, ప్రభుత్వ పథకాలకు తగినంత చేరువ కాలేకపోతున్నారు.

ఎఆర్ (అగుమెంటెడ్ రియాలిటీ), కృత్రిమ మేధ, మెషిన్ లాంగ్వేజ్ ఆధారిత వ్యక్తిగత పరిష్కారాలను అందించేందుకు వాయిస్ బోట్స్, రైతులు తమ సొంత భాషలో మాట్లాడేందుకు వీలు కల్పించే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లాంటి అంశాలతో కూడిన తన సాంకేతిక వేదికను ఉపయోగించడం ద్వారా పటిష్ఠమైన పంపిణి వ్యూహాన్ని వృద్ధి చేసేందుకు వింగ్ స్యూర్ వివిధ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో కలసి పని చేయనుంది. సంస్థ పంట మరియు ఇతర సాధారణ బీమా ఉత్పాదనలను తన నెట్ వర్క్ బీమా మరియు బ్రోకర్ భాగస్వాముల ద్వారా పంపిణి చేయనుంది. సలహాలు, శిక్షణలతో పాటుగా వేగవంతమైన బీమా క్లెయింలను తన మొబైల్ ఆధారిత ప్లాట్ ఫామ్ ల ద్వారా అందించనుంది.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఐటీఈ అండ్ సి ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ, ‘‘వ్యవసాయాన్ని పరివర్తింపజేసేందుకు సాంకేతికత అధునాతనం, అమలు ముఖ్యమైన మార్గాలు. మన ప్రభుత్వం వ్యసాయాన్ని ప్రాధాన్య రంగంగా గుర్తించింది. వ్యవసాయ ఉత్పాదనను పెంచడం, రైతుల జీవనోపాధులను మెరుగుపరచడంలో కృత్రిమ మేధ, ఇతర వర్ధమాన సాంకేతికతల ప్రాధాన్యాన్ని గుర్తించింది. వింగ్ స్యూర్ తో అనుబంధం సాంకేతికతతో డేటా సేకరణకు తోడ్పడుతుంది, చిన్న, సన్నకారు రైతులకు వివిధ రకాల సేవలు అందించేందుకు సహకరిస్తుంది’’ అని అన్నారు.
వింగ్ స్యూర్ వ్యవస్థాపకులు, సీఈఓ అవి బసు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘తెలంగాణ ప్రభుత్వ ఆశయం మరియు ఇరవై మిలియన్ల మంది జీవితాలను ప్రభావితం చేయడంలో వర్ధమాన సాంకేతికతల ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవడం రాష్ట్రంలో వివిధ రంగాల్లో కృత్రిమ మేధను అమలు చేయడానికి దారి తీసింది. వింగ్ స్యూర్ యొక్క డీప్ టెక్ ప్లాట్ ఫామ్ శీతోష్ణస్థితి ముప్పు అవకాశాలతో వివిధ రకాల ముప్పు అవకాశాలను తొలగించుకునేందుకు తోడ్పడుతుంది. రైతులతో, వ్యవసాయ వాల్యూ చె యిన్ లో ఉండే వారితో అర్థవంతంగా మిళితం అయ్యేందుకు సహకరిస్తుంది’’ అని అన్నారు.
వింగ్ స్యూర్ గురించి:
వింగ్ స్యూర్ ప్రపంచవ్యాప్తంగా రైతులను కాపాడేందుకు కృత్రిమ మేధ, డీప్ టెక్నాలజీలను వినియోగిస్తోం ది. వర్ధమాన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల్లో కంపెనీ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. సంప్రదా యక ఆర్థిక సేవలకే పరిమితమైన వారికి కొత్త అవకాశాలను అందించడంపై దృష్టి పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా వ్యక్తుల హుందాదనం, సుస్థిరదాయకతలను నిర్వహించేందుకు సాంకేతికతను, భద్రతను ఇది రైతులకు అందిస్తోంది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్