Wednesday, June 17, 2026
Homeసినిమా‘ధ్వని’ ఫస్ట్ లుక్ విడుదల

‘ధ్వని’ ఫస్ట్ లుక్ విడుదల

వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌ను, విభిన్న‌మైన పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకుంటున్న యంగ్ టాలెంట్‌ హీరో వినయ్ ‘ధ్వని’ అనే డిఫ‌రెంట్ మూవీతో ఆక‌ట్టుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ సినిమా ఫ‌స్ట్‌ లుక్‌ ను హీరో నవదీప్ విడుద‌ల చేశారు. “డైరెక్టర్ దుర్గ నాకు రెండు సంవత్సరాలుగా తెలుసు, ఆయనలో చాలా కృషి, పట్టుదల ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది” అని నవదీప్ పేర్కొన్నారు.

ఫ‌స్ట్‌ లుక్‌ను గ‌మ‌నిస్తే… సీరియ‌స్‌గా తలకి కట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉన్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సౌండ్ కి సంబందించిన వ్యాధితో బాధపడే ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనలు, ఆ సంఘటనల నుండి ఎలా బయటపడ్డాడు అనేది మూవీ కాన్సెప్ట్ అని చిత్ర బృందం తెలిపింది.

లుక్ చూస్తుంటే వినయ్ త‌న‌ పాత్ర కోసం ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ బాగానే అయ్యార‌నేది తెలుస్తుంది. అలాగే త‌న లుక్ కూడా డిఫ‌రెంట్‌గా ఉంది. క‌థానాయ‌కుడి పాత్ర స‌రికొత్త డైమ‌న్ష‌న్‌లో ఉంటుంద‌ని లుక్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. పరమ కృష్ణ పిక్చర్స్ అండ్ క్రియేషన్స్ పతాకం పై పరమ కృష్ణ సాన  సమర్పణలో సాధన నన్నపనేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ నాగ దుర్గారావు సాన  దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం చివరి దశలో ఉంది. యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్రతిక్ అబ్యాంకర్ మరియు ఆనంద్ నంబియర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నర్ ఎంఆర్. రాజకీష్ణన్ సౌండ్ మిక్సింగ్ కి పని చేస్తున్నారు. ఈ చిత్రంలో వినయ్ పనిగ్రహి, స్వాతి మండది, త్రినాధ్ వర్మ, రవీందర్ రెడ్డి , భావన సాగి, సురేష్ ,కుమార్, దేవ్, సాయి మరియు త‌దిత‌రులు నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular