Saturday, January 18, 2025
Homeసినిమాచరణ్‌ - శంకర్ మూవీలో హీరోయిన్ ఎవరు?

చరణ్‌ – శంకర్ మూవీలో హీరోయిన్ ఎవరు?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ – గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం ప్లానింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత చరణ్‌ నటించే సినిమా ఇదే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతోంది. ఇది చరణ్ కి 15వ సినిమా కాగా, దిల్ రాజుకు 50వ చిత్రం కావడం విశేషం. ఈ క్రేజీ మూవీని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఇందులో కథానాయిక ఎవరు ? అనేది ఆసక్తిగా మారింది.

ఈ మూవీలో చరణ్ సరసన నటించే హీరోయిన్ అంటూ క్రేజీ హీరోయిన్ రష్మిక పేరు వినిపించింది. ఆతర్వాత బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ పేరు కూడా వినిపించింది. ఇలా చాలా మంది కథానాయికల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా మాళవిక మోహనన్‌ పేరుని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. తమిళ్ స్టార్ హీరో విజయ్‌ కథానాయకుడిగా నటించిన మాస్టర్‌ చిత్రంతో ఈ భామ తెలుగు ప్రేక్షకులకూ పరిచయమైంది. ఈ మాస్టర్ బ్యూటీని దాదాపు కన్ ఫర్మ్ అయినట్టే అనే వార్తలు వస్తున్నాయి. మరి.. శంకర్‌ ఈ బ్యూటీకే ఓటేస్తాడా? లేక మరో భామని ఎంపిక చేస్తారా ? అనేది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్