Monday, June 15, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్సోమిరెడ్డి పై కాకాణి ఫైర్

సోమిరెడ్డి పై కాకాణి ఫైర్

ఆనందయ్య మందు విషయంలో తనపై మాజీ మంత్రి సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలను వైసిపి నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మందు పంపిణి విషయంలో పార్టీకి కానీ, ప్రభుత్వానికి గానీ ఎలాంటి సంబంధం లేదని, ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం చేస్తామని మాత్రమే ఆనందయ్యకు చెప్పామని వెల్లడించారు. మందుపై ప్రజలకు నమ్మకం ఏర్పడి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారని, కోవిడ్ పరిస్థితులలో ఇంతమంది ఇక్కడకు రావడం ఇబ్బంది అవుతుందనే పంపిణీ నిలిపివేశామని చెప్పారు.

ప్రజలు ఇక్కడకు రాకుండా వారికి నేరుగా మందు అందించాలనే కొరియర్, పోస్టాఫీసు ద్వారా మందు పంపాలని ఆనందయ్య అనుకున్నారని కాకాణి అన్నారు. ఆన్ లైన్ లో మందు పంపిణీ చేయాలన్నది తన నిర్ణయం కాదని స్పష్టం చేశారు. మందుకు సంబంధించి ఆన్ లైన్ సేవలు అందిస్తామని ఎవరు తన వద్దకు వచ్చినా ఆర్ డి ఓ, జాయింట్ కలెక్టర్లకు వద్దకు పంపానన్నారు. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సోమిరెడ్డికి సవాల్ చేశారు. ఈ మందు విషయంలోనే కాదని, నేను ఏ విషయంలోనైనా అవినీతి చేసినట్లు సోమిరెడ్డి ఆధారాలు బైట పెట్టాలని డిమాండ్ చేశారు.

అంతకుముందు సోమిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఆనందయ్య మందు పేరుతో కాకాణి భారీ స్కెచ్ వేశారని, కోట్ల రూపాయలు దండుకోవాలని చూస్తున్నారని, ఆన్ లైన్ పేరుతో నకిలీ వెబ్ సైట్ తెరిచారని తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై కాకాణి మండిపడ్డారు.

సోమిరెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని, ‘ నీవు నెల టిక్కెట్ గాడివి నువ్వు నా గురించి మాట్లాడతావా’ అంటూ నిలదీశారు. ఆనందయ్య మందు పంపిణీ సాఫీగా జరిగితే తనకు మంచి పేరు వస్తుందని సోమిరెడ్డికి కడుపు మంట అని కాకాణి దుయ్యబట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular