Saturday, July 27, 2024
Homeతెలంగాణమామ మాటే నా బాట : హరీష్ రావు

మామ మాటే నా బాట : హరీష్ రావు

టీఆర్ఎస్‌ పార్టీలో తాను నిబద్ధత, విధేయ‌త‌, క్‌వమ‌శిక్ష‌ణ ఉన్న‌ కార్య‌క‌ర్త‌నని ఆర్ధిక శాఖ మంత్రి తనీరు హరీష్ రావు స్పష్టం చేశారు. ఆవిర్భావం నుంచి నేటి వ‌ర‌కు పార్టీ ప్ర‌యోజ‌నాలే ప‌ర‌మావ‌ధిగా పనిచేస్తున్నానని గుర్తు చేశారు. తనకు పార్టీ, నాయ‌క‌త్వం ఏ ప‌ని అప్ప‌గించినా దాన్ని పూర్తిచేయ‌డం తన విధి, బాధ్య‌త‌ అని వెల్లడించారు.

‘పార్టీ నాయ‌కుడిగా కేసీఆర్ ఏ ఆదేశం ఇచ్చినా శిర‌సావ‌హించ‌డం కర్త‌వ్యంగా భావిస్తానని, ‘కేసీఆర్ గారు పార్టీ అధ్య‌క్షులే కాదు, నాకు గురువు, నా మార్గ‌ద‌ర్శి, నాకు తండ్రితో స‌మానులు. ఆయ‌న మాట జ‌వ‌దాట‌కుండా న‌డుచుకుంటున్నాను. గ‌తంలో అనేక‌సార్లు ఇదే విష‌యం సుస్ఫ‌ష్టంగా అనేక వేదిక‌ల‌పై చెప్పాను. ఇప్పుడు మ‌రోసారి చెప్తున్నా… కంఠంలో ఊపిరిఉన్నంత వ‌ర‌కు ఇలాగే న‌డుచుకుంటా’ అని హరీష్ రావు ప్రకటించారు.

ఈటెల రాజేందర్ తన గురించి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందించారు. ‘తాచెడ్డ కోతి వ‌న‌మెల్ల చెరిచింద‌న్న‌ట్టుగా ఉన్న‌ది ఈట‌ల రాజేంద‌ర్ గారి వైఖ‌రి. పార్టీని వీడ‌డానికి ఆయ‌న‌కు అనేక కార‌ణాలుండొచ్చు. పార్టీలో ఉండాలా.. వెళ్లిపోవాలా అన్న‌ది ఆయ‌న ఇష్టం. ఆయ‌న పార్టీని వీడిన టీఆర్ఎస్ పార్టీకి వీస‌మెత్తు న‌ష్టం కూడా లేదు. ఆయ‌న పార్టీకి చేసిన సేవ‌క‌న్నా.. పార్టీ ఆయ‌న‌కు ఇచ్చిన అవ‌కాశాలే ఎక్కువ‌. త‌న స‌మ‌స్య‌ల‌కు , త‌న గొడ‌వ‌కు నైతిక బ‌లం కోసం ప‌దేప‌దే నా పేరును ప్ర‌స్తావించ‌డం ఈట‌ల రాజేంద‌ర్ భావ‌దారిద్య్రానికి, విజ్ఙ‌త‌, విచ‌క్ష‌ణ‌లేమికి నిద‌ర్శ‌నం. నా భుజాల మీద తుపాకి పెట్టాల‌నుకోవ‌డం విఫ‌ల ప్ర‌య‌త్నం మాత్ర‌మే కాదు.. వికార‌మైన ప్ర‌య‌త్నం కూడా. ఆయ‌న మాట‌ల్లో మ‌నో వికార‌మే త‌ప్ప స‌త్యం ఎంత మాత్రం లేదు. నా గురించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నా’ అని ప్రకటనలో వెల్లడించారు.
.

RELATED ARTICLES

Most Popular

న్యూస్