Tuesday, June 9, 2026
Homeసినిమాపాజిటివ్‌గా ఉండండి... ‘పాజిటివ్‌’ తెచ్చుకోకండి: సంజన

పాజిటివ్‌గా ఉండండి… ‘పాజిటివ్‌’ తెచ్చుకోకండి: సంజన

‘బుజ్జిగాడు’ హీరోయిన్ సంజన శాండల్ వుడ్ సినీ కార్మికుల కుటుంబాలకు సంజన గల్రాని ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులను సహాయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంజన మాట్లాడుతూ ” ‘కోవిడ్‌ భాదితులు మెరుగైన ఆరోగ్యంతో కోలుకోవాలని, వారి జీవితాల్లో తిరిగి సంతోషం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. తమ జీవితాలను, కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్‌  వర్కర్స్ తో పాటుగా కోవిడ్‌ కట్టడిలో భాగస్వామ్యులైన అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు.

మాస్కులు ధరించడం, ప్రతిరోజు శానిటైజ్‌ చేసుకోవడం, భౌతికదూరం పాటించడం..ఇలా కోవిడ్‌ నియంత్రణ చర్యలను పాటించడం వల్లనే ఈ ప్రపంచం కోవిడ్‌ మహమ్మారినుంచి భయటపడుతుంది. నేను స్థాపించిన  సంజన గల్రాని ఫౌండేషన్ ద్వారా ఉడతా భక్తిగా  మే 10 నుండి మా ఇంటి సెల్లార్ లోనే వంట వండించి రోజు 500 మందికి రెండు పూటలా వెజిటేబుల్ బిర్యానీ, పెరుగన్నం, పులిహోర, బిష్బిళ్ళ బాత్ ఇలా  రోజు మెనూ మారుస్తూ పేదవారికి ఆహరం అందిస్తున్నాను.

అదేవిధంగా లాక్ డౌన్ కారణంగా రోజు వారి కూలికి పనిచేసే సినీ పరిశ్రమకు చెందిన లైట్ బాయ్స్, ప్రొడక్షన్ ఫోర్త్ క్లాస్ కార్మికులకు 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులను జూన్ 2న అందించాను. భవిష్యత్‌లో కూడా ఇలాంటి సహాయాలను కొనసాగిస్తాను” అంటూ దయచేసి అందరు ఇంట్లోనే ఉడండి. కోవిడ్‌ నియంత్రణ చర్యలను పాటించండి. పాజిటివ్‌గా ఉండండి కానీ కోవిడ్‌ పాజిటివ్‌ తెచ్చుకోకండి అని పేర్కొన్నారు.

రు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular