Saturday, January 18, 2025
Homeసినిమానిరాశపరిచే 'హైడ్ అండ్ సీక్'

నిరాశపరిచే ‘హైడ్ అండ్ సీక్’

ఈ శుక్రవారం థియేటర్లకు వచ్చిన సినిమాలలో ‘హైడ్ అండ్ సీక్’ ఒకటి. విశ్వంత్ .. రియా సచ్ దేవ్ .. సాక్షి శివ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, బసిరెడ్డి రానా దర్శకత్వం వహించాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమాకి, నరేంద్ర బుచ్చిరెడ్డి నిర్మాతగా వ్యవహరించగా, లిజో సంగీతాన్ని సమకూర్చాడు. ఈ శుక్రవారం థియేటర్ల దగ్గర పెద్దగా సినిమాలు లేకపోవడంతో, సహజంగానే ఈ సినిమాపైకి దృష్టి వెళ్లింది.

ఈ సినిమాలో హీరో .. శివ పాత్రలో కనిపిస్తాడు. అతను ఒక మెడికల్ స్టూడెంట్. కాలేజ్ లో ‘వర్ష’ను చూడగానే తొలిచూపులోనే మనసు పారేసుకుంటాడు. వాళ్ల ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు పెళ్లికి అంగీకరిస్తారు. ఆ సమయంలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ కేసులో శివ ఒక అనుమానితుడిగా పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. ఆ హత్యలతో శివకి ప్రమేయం ఉంటుందా? ఆ కేసును ఛేదించడానికి రంగంలోకి దిగిన వైష్ణవికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనేది కథ.

ఒక కథ వరుస హత్యల చుట్టూ కథ తిరిగేటప్పుడు, హత్యలు జరుగుతున్న తీరు .. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న విధానమే ప్రేక్షకులలో ఉత్కంఠను పెంచుతూ వెళ్లాలి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఒక టెన్షన్ బిల్డప్ కావాలి. కానీ ఈ కథలో అదే లోపించింది. చకచకా పరుగెత్తవలసిన కథ, నిదానంగా .. నింపాదిగా నడుస్తూ ఉంటుంది. పైగా రొటీన్ కి భిన్నంగా లేని స్క్రీన్ ప్లే నిరాశపరుస్తుంది. అందువలన ఇది పెద్దగా ఆసక్తిని రేకెత్తించలేకపోయిన సాదాసీదా కంటెంట్ గానే అనిపిస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్