Saturday, January 18, 2025
HomeTrending Newsచింతామణి నిషేధంపై స్టే కు నో

చింతామణి నిషేధంపై స్టే కు నో

No Stay:  చింతామణి నాటకం నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ఏపీ హైకోర్టు నిరాకరించింది.  నాటకాన్ని  నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎంపీ  రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. అయన  తరపున ప్రముఖ న్యాయవాది ఉమేష్ వాదనలు వినిపించారు.

చింతామణి నాటకాన్ని నిషేధించడం వాక్ స్వాతంత్రాన్ని హరించడమే ఆవుతుందని, ఈ నిషేధంతో పలువురు జీవన ఉపాధి కోల్పోయారని అయన కోర్టు దృష్టికి తెచ్చారు. దేవదాసి చట్టానికి వ్యతిరేకంగా ఈ నాటకం వచ్చిందని,  నాటకాన్ని నిషేధించాల్సిన అవసరంలేదని తెలిపారు.  ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు.  అయితే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం  ప్రతివాది అభ్యర్థనను తోసిపుచ్చింది. వ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది.  నాటకానికి సంబంధించిన అసలు పుస్తకానని అనువదించి సమర్పించాల్సిందిగా ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఆగస్టు 17 కు వాయిదా వేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్