ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. నగర పర్యటనకు భారీ భద్రత ఏర్పాటు చేశారు నగర పోలీసులు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధానితో పాటు రానున్న కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు ప్రత్యేక భద్రత కల్పించనున్నారు. సుమారు ఐదు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే నోవాటెల్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. మోదీ పర్యటన ఉన్నంతసేపు మూడంచెల భద్రత కొనసాగనుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, హెచ్‌ఐసీసీ, రాజ్‌భవన్ చుట్టూ కేంద్ర బలగాలు మోహరించాయి. డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
ప్రధానమంత్రి బసపై నిర్ణయం
రాజ్‌భవన్‌లో బస చేస్తే.. ఇబ్బందికర పరిస్థితులు ఉండొచ్చని తెలంగాణ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో.. రాజ్‌భవన్‌లో ప్రధాని మోదీ బసపై ఎస్పీజీ(Special Protection Group) నిర్ణయం తీసుకోనుంది. జూలై 2, 3వ తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాలకు ప్రధాని మోడీ హాజరుకానుండటంతో భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ సమీక్షిస్తోంది.
Also Read : హైదరాబాద్ లో ప్రధాని రోడ్ షోకు కసరత్తు