Thursday, February 22, 2024
HomeTrending Newsహైదరాబాద్ లో ప్రధాని రోడ్ షోకు కసరత్తు

హైదరాబాద్ లో ప్రధాని రోడ్ షోకు కసరత్తు

హైదరాబాద్ లో జరిగే బిజెపి జాతీయ కార్యవర్గ భేటీలకు తెలంగాణ కమల దళం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా సహా సహా కేంద్ర కేబినెట్‌, బీజేపీ పాలిత సీఎంలు ఈ సమావేశానికి రానున్నారు. జులై 2, 3న హైటెక్స్ నోవాటెల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశమవుతుంది. సమావేశాల కోసం 30 కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్డుషోకు తెలంగాణ బీజేపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

బీజేపీ పాలిత సీఎంల టైంను రాజకీయంగా వాడుకునేలా ప్లాన్ చేస్తున్నారు.  తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ లో స్థిరపడ్డ ఇతర రాష్ట్రాల ప్రజలతో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో , ముఖ్య నాయకులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయాలని జాతీయ నాయకత్వం ఇప్పటికే ఆదేశించింది. ఈ దిశగా ఇప్పటికే రాష్ట్ర నేతాలు కార్యచరన సిద్దం చేస్తున్నారు. కార్యకర్తలను గ్రూపులుగా విభజించి సీఎంలు, కేంద్రమంత్రులతో భేటీలు అవుతారు. తెలంగాణలోపార్టీ బలోపేతమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.

Also Read : తెలంగాణలో పాగా వేసేందుకు బిజెపి ప్రణాళికలు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్