చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పర్యటనను వ్యతిరేకిస్తూ టిడిపి కార్యకర్తలు ఆందోళన చేశారు. పుంగనూరులో లో చిత్తూరు మాజీ ఎంపి రెడప్ప ఇంటికి మిథున్ రెడ్డి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న టిడిపి నేతలు, కార్యకర్తలు ఆయన ఇంటిని చుట్టుముట్టి మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకుని వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పరస్పరం రాళ్ళ దాడి చేసుకోవడంతో భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. రాళ్ళ దాడిలో పది వాహనాలు ధ్వంసమయ్యాయి. దీనిలో మిథున్ రెడ్డి కారు కూడా ఉంది.కొద్దిసేపటి తరువాత మరోసారి టిడిపి కార్యకర్తలు దాడికి యత్నించాడంతో ఎంపి గన్ మెన్ మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు.
ఈ ఘటనపై మిథున్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఇలాంటి దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశాయి. ప్రజలు ఈ పాలనను హర్షించే పరిస్థితి లేదని…. సంక్షేమ పథకాలకు కోత పెడుతున్నారని, అమ్మ ఒడి లో ఇంటికి ఒకరికే ఇస్తామని చెబుతున్నారని విమర్శించారు. హామీలు ఎప్పటినుంచి అమలు చేస్తారో కూడా చెప్పడంలేదన్నారు.
పుంగనూరు అభివృద్ధిని ఆపేస్తున్నారని…. ఇప్పటికే పూర్తి కావొచ్చిన పరిశ్రమలకు సహకారం అందించడంలేదని… గొడవలు సృష్టించి వారిని వెళ్ళగొట్టదానికి ప్రయతిస్తున్నారని ఆరోపించారు.