Monday, June 8, 2026
Homeసినిమామారుతి వినోదాల విందు ‘మంచి రోజులు వచ్చాయి’

మారుతి వినోదాల విందు ‘మంచి రోజులు వచ్చాయి’

దర్శకుడు మారుతి తెరకెక్కించిన తాజా చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించారు. యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌, ‘సోసోగా ఉన్నా’, ‘ఎక్కేసిందే’ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఆద్యంతం వినోదాల విందుగా ఈ ట్రైలర్ సాగింది. ముఖ్యంగా డైలాగులు చాలా అద్భుతంగా ఉన్నాయి. యువీ వాళ్లు రాధే శ్యామ్ తీశారని ఊరికే ఉన్నారా.. ఏక్ మినీ కథ తీయలేదు.. కంటెంట్ ఎక్కుడుంటే అక్కడికి వెళ్లిపోవడమే’ అంటూ సరదా సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.

సంతోష్ శోభన్, మెహ్రీన్ మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉంది. అలాగే అజయ్ ఘోష్ కామెడీ కూడా ట్రైలర్‌లో ఆకట్టుకుంది. దీపావళి సందర్భంగా నవంబర్ 4న ‘మంచి రోజులు వచ్చాయి’ విడుదల కానుంది. ఈ సినిమాను వి సెల్యులాయిడ్ SKN నిర్మించారు. ఏక్ మినీ కథ లాంటి హిట్ సినిమాను నిర్మించిన యూవీ కాన్సెప్ట్స్‌ తో మరోసారి జోడీ కట్టాడు సంతోష్ శోభన్. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. మిగిలిన వివరాలు దర్శక నిర్మాతలు త్వరలోనే తెలియజేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular