పాకిస్థాన్ దేశంలో మరో దారుణం వెలుగుచూసింది. ఉచితంగా రేషన్ ఇస్తామని ఆశపెట్టి ఓ హిందూ మైనర్ బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి మత్తుమందు ఇచ్చి ఆమెపై సామూహిక అత్యాచారం జరిపిన దారుణ ఘటన జరిగింది. పాక్ లోని సింధ్ ప్రావిన్సు… సంఘార్ జిల్లా షహదాద్ పూర్ గ్రామానికి చెందిన 13 ఏళ్ల హిందూ బాలిక(భగవంతి ) కూరగాయలు కొనేందుకు మార్కెటుకు వచ్చింది. అదే గ్రామానికి చెందిన ఖాలిద్ మాషి, బర్షేక్ మాషీలనే ఇద్దరు ముస్లీం యువకులు బాలికకు ఉచితంగా రేషన్ ఇస్తామంటూ చెప్పి గ్రామం బయట నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లారు. మత్తుమందు కలిపిన పానీయాన్ని బాలికతో తాగించి ఇద్దరు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.
బాధిత బాలిక కుటుంబసభ్యులు, గ్రామస్థులు నిందితులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. వరదలతో అల్లాడుతున్న సింధ్ ప్రావిన్సులో మైనారిటీ (హిందూ, సిక్కు) మహిళలపై సహాయం పేరిట లైంగిక వేధింపులు సాగుతున్నాయని వాయిస్ అఫ్ పాకిస్తాన్ మైనారిటీ స్వచ్చంద సంస్థ ప్రకటించింది. ఉమర్ కోట్ జిల్లాలోనూ ఉచిత రేషన్ ఇస్తామంటూ ఇద్దరు హిందూ మహిళలపై అత్యాచారం జరిగింది. సింధ్ ప్రావిన్సులో 4రోజుల క్రితం 8 ఏళ్ల బాలికకు కళ్లు గప్పి ఆమెపై అత్యాచారం చేసిన ఘటన వీడియో కూడా సోషల్ మీడియాలో వెలుగుచూసింది.ఈ ఘటన సంచలనం రేపింది. గతవారం పాకిస్థాన్ లో 21 ఏళ్ల అమెరికన్ బ్లాగరుపై సామూహిక అత్యాచారం జరిగింది.
పాక్ దేశంలో 157 మంది మహిళలు ఇటీవల కిడ్నాప్ కాగా వారిలో 112 మందిపై అత్యాచారం జరిగిందని వెల్లడైంది.ఈ ఏడాది ఒక్క జూన్ నెలలోనే 180 మంది బాలికలపై అత్యాచారం జరిగింది. సింధ్, ఇస్లామాబాద్, ఖైబర్ ఫక్తూన్ ఖవా, బలోచిస్థాన్ ప్రాంతాల్లో మహిళలపై అత్యాచారాల ఘటనలు సాధారణం అయ్యాయి.