Tuesday, March 10, 2026
Homeస్పోర్ట్స్Hockey: దాయాదిపై ఇండియా ఏకపక్ష విజయం

Hockey: దాయాదిపై ఇండియా ఏకపక్ష విజయం

ఆసియన్ హాకీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు జరిగిన మ్యాచ్ లో దాయాది పాకిస్తాన్ పై ఇండియా 4-0తో ఏకపక్షంగా విజయం సాధించింది. చెన్నై లోని మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఇండియా… ఒక్కో పావు భాగంలో ఒక్కో గోల్ సాధించింది.

ఈ నాలుగు గోల్స్ లో తొలి మూడు ఫీల్డ్ గోల్స్ కాగా, చివరిది ఫీల్డ్ గోల్డ్

  • 15, 23 నిమిషాల్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ రెండు పెనాల్టీ కార్నర్స్ ను గోల్స్ గా మలిచాడు.
  • 36 వ నిమిషంలో జుగ్ రాజ్ మరో గోల్ సాధించాడు.
  • 55 వ నిమిషంలో ఆకాష్ దీప్ సింగ్ ఫీల్డ్ గోల్ చేశాడు.

కాగా, ఈ మ్యాచ్ ఓటమితో పాకిస్తాన్ సెమీస్ లో చోటు దక్కించుకోలేకపోయింది.

లీగ్ దశలో  ఇండియా ఐదు మ్యాచ్ లు ఆడి, నాలుగు విజయాలు, ఒక డ్రా తో 13 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

ఇండియా తో పాటు మలేషియా, సౌత్ కొరియా, జపాన్ జట్లు సెమీస్ కు చేరుకోగా, ఐదో స్థానం కోసం పాకిస్తాన్- చైనా తలపడనున్నాయి.

ఎల్లుండి ఆగస్టు 11న జరిగే రెండో సెమీస్ లో ఇండియా జపాన్ తో ఆడనుంది.

శనివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular