Holi Celebrations : వసంత రుతువు ఆగమనంతో వచ్చే తొలి వేడుక హోలీ సంబరాలు దేశవ్యాప్తంగా అంబరాన్ని అంటాయి. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా ఉత్సాహంగా ప్రజలు రంగుల్లో మునిగితేలారు. అందరూ రంగులు చల్లుకుని ఘనంగా వేడుకలు జరుపున్నారు. స్నేహితులు, సన్నిహితులు పాటలకు స్టెప్స్ వేస్తూ అందరూ ఒక చోట చేరి కలర్ ఫుల్ రంగులను చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు. కరోనాతో రెండేళ్లుగా సంబరాలకు దూరంగా ఉన్న జనం తిరిగి సాధారణ పరిస్థితులు రావడంతో.. ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు.
మధుర బృందావనంలోని బన్ కే బిహారీ ఆలయం వద్ద హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. హోలీ వేడుకల కోసం కృష్ణాలయం దగ్గరికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. హరే రామ హరే కృష్ణ అంటూ ఒకరిపై ఒకరు రంగులు జల్లుకున్నారు. కృష్ణ భగవానుడి ఆలయం నుంచి వచ్చిన రంగుల కోసం జనం ఎగబడ్డారు.
పశ్చిమ బెంగాల్ లోని శాంతినికేతన్ లో వసంతోత్సవ వేడుకలు సంప్రదాయబద్దంగా సాగాయి. శాంతినికేతన్ విద్యార్థులు రంగులు చల్లుకొని డోలోత్సవం నిర్వహించారు. కలకత్తా నగరంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి.