Friday, March 29, 2024
Homeసినిమాఎన్టీఆర్ మూవీలో హాలీవుడ్ విలన్?

ఎన్టీఆర్ మూవీలో హాలీవుడ్ విలన్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీలో కొమరం భీమ్ గా నట విశ్వరూపం చూపించారు. ఈ  చిత్రం విదేశాల్లో సైతం సంచలనం సృష్టించింది. దీంతో ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాపై నార్త్ , హాలీవుడ్ ఆడియన్స్ లో కూడా ఆసక్తి పెరిగింది. కొరటాల శివతో  తన తదుపరి సినిమా న్టీఆర్ చేస్తున్నారు.

ఫిబ్రవరి నుంచి ఎన్టీఆర్, కొరటాల ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీకపూర్ నటించనుందని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ ను తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ పాత్ర కోసం ఓ హాలీవుడ్ యాక్టర్ ను తీసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తుందట టీమ్. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ కి హాలీవుడ్ లో కూడా గుర్తింపు వచ్చింది కాబట్టి.. ఓ హాలీవుడ్ యాక్టర్ ను ఎన్టీఆర్ సినిమాలో పెట్టే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. మొత్తానికి కొరటాల శివ ఈ చిత్రానికి నటీనటులను ఎంపిక చేస్తున్న విధానం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఆ మధ్య బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పేరు కూడా వినిపించింది. మరి ఎన్టీఆర్ కి విలన్ గా.. బాలీవుడ్ విలన్ ని ఫిక్స్ చేస్తారో..?  హాలీవుడ్ విలన్ ని ఫిక్స్ చేస్తారో చూడాలి.

Also Read : ట్రోల్స్ కు ఎన్టీఆర్ ధీటైన జవాబు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్