Tuesday, June 9, 2026
HomeTrending Newsహోంశాఖ ఆధ్వర్యంలో పచ్చతోరణం

హోంశాఖ ఆధ్వర్యంలో పచ్చతోరణం

Plantation: మియావాకి పద్దతిలో రాష్ట్రంలోని ఎనిమిది పోలీసు బెటాలియన్లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర హోం శాఖా మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్ లో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  బ్రాడిపేటలోని తన క్యాంప్ కార్యాలయం ద్వారా ఈ కార్యక్రమంలో హోం మంత్రి పాల్గొన్నారు.

మంగళగిరి 6వ బెటాలియన్ లో డీజీపీ గౌతం సవాంగ్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని మొక్కలు నాటారు. అన్ని బెటాలియన్లలో దాదాపు 15.35 ఎకరాల్లో 19,774 మొక్కలు పోలీసు అధికారులు నాటారు. ఈ  పోలీసు కుటుంబ సభ్యులతో పాటు,  స్థానిక స్కూల్ విద్యార్థులు, ఫారెస్ట్ అధికారులు కూడా పాల్గొన్నారు.

మియావాకి పద్దతిలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచవచ్చని…. మొక్కలు నాటడంతో పాటు అవి బాగా పెరిగే వరకు సంరక్షించాలని అధికారులకు హోంమంత్రి సుచరిచ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular