Friday, March 20, 2026
HomeTrending Newsఎస్పీఎఫ్ పై హోం మంత్రి సమీక్ష

ఎస్పీఎఫ్ పై హోం మంత్రి సమీక్ష

ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఏపీ ఎస్పీఎఫ్) పై రాష్ట్ర హోం శాఖ మంత్రి  తానేటి వనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. హోం శాఖతో పాటు SPF ఉన్నతాధికారులు దీనిలో పాల్గొన్నారు.  ప్రభుత్వరంగ సంస్థల్లో SPF తీసుకుంటున్న చర్యలు, దేవాలయాల్లో భద్రత, సీసీ కెమెరాల నిఘా వంటి అంశాలపై హోంమంత్రి చర్చించారు.

SPF సిబ్బందికి సంబంధించిన సమస్యలు, సవాళ్ళను, ప్రొమోషన్స్, ఇతర అంశాలపై కూడా ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు.  సమావేశంలో పాల్గొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా, స్పెషల్ సెక్రటరీ విజయ్ కుమార్, SPF డీజీ సంతోష్ మెహ్రా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో SPF పోలీసుల పని తీరు గురించి వివరించిన డీజీ సంతోష్ మెహ్రా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular