Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

రెండు సార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేశారు కేసీఆర్…రాష్టం మీద నాలుగు లక్షల కోట్ల అప్పు తెచ్చారని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల అప్పు ఉందన్నారు. జగిత్యాల నియోజక వర్గంలో  వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందడిగా సాగుతోంది. తిప్పన్న పేట, పోలాస, అనంతారం, తక్కెళ్లపల్లి గ్రామాల్లో వైఎస్ షర్మిలకి ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు.. వైఎస్ షర్మిలతో మాట్లాడేందుకు ఆసక్తి చూపారు. వివిధ గ్రామాల ప్రజలతో మాట్లాడుతూ.. వారి యోగ క్షేమాలపై వైఎస్ షర్మిల ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కెసిఆర్ పాలనపై దుమ్మెత్తి పోశారు.

వైఎస్ షర్మిల విమర్శలు ఆమె మాటల్లోనే…

ఒక్క కుటుంబానికైనా ఏదైనా సాయం అందిందా? వైయస్ఆర్ ఉన్నప్పుడు ఇన్ పుట్ సబ్సిడీ ఉండేది , ఎరువుల మీద సబ్సిడీ ఉండేది, బోర్లు, డ్రిప్ వేసుకోవడానికి సాయం అందించారు. ఇప్పుడు కేసీఆర్ పాలనలో అవేవీ లేవు. 30 నుంచి 40 వేలు వచ్చే పథకాలు బంద్ పెట్టి కేసీఆర్ ఇచ్చే 5 వేలతో రైతులు కోటీశ్వరులవుతున్నారంటున్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పారు చేశారా? మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు, కేజీ టూ పీజీ ఉచిత విద్య అన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు, నిరుద్యోగ భ్రుతి అన్నారు, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామన్నారు ఏదీ నెరవేర్చలే. మూడెకరాల భూమి, ఉచిత ఎరువులు, 57 ఏళ్లకే పెన్షన్ అన్నీ మోసపూరిత హామీలే. కేసీఆర్ జన్మకు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా? కేసీఆర్ ను ముఖ్యమంత్రి అనాలా 420 అనాలా?

ప్రజల్ని మోసం చేసిన కేసీఆర్ ను మోసగాడనే అనాలి. లక్షల కోట్లు అప్పు చేసి కూడా ఏ పథకానికీ డబ్బు లేదు. హాస్టళ్లలో పిల్లలకు పురుగులు పట్టిన అన్నం పెడుతున్నారు. పిల్లలు ఏం ప్రశ్నించలేరు, వాళ్లకు ఓటు హక్కు లేదనా? బంగారు తెలంగాణలో కనీసం చిన్న పిల్లలకు మంచి ఆహారం పెట్టలేని కేసీఆర్ ఉరేసుకొని చచ్చిపోవాలి కదా. కేసీఆర్ ఏ వర్గానికి న్యాయం చేయలేదు. కేసీఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ అయింది. ఉద్యమ సమయంలో నాకు ఉద్యమం తప్ప ఏదీ అవసరం లేదన్నాడు.. ఇప్పుడు కుటుంబం మొత్తం పదవులు అనుభవిస్తున్నారు. స్కూటర్ లో తిరిగే కేసీఆర్ తెలంగాణ ఖజానా కొల్లగొట్టి హెలీకాప్టర్, విమానాలు కొంటున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే 70 వేల కోట్లు దోచేశాడు. – కేసీఆర్ ఎప్పుడు వచ్చినా ఎన్నికల సమయంలో ఓట్ల కోసమే వస్తున్నాడు.
– ప్రజలు మళ్లీ మళ్లీ నమ్మి కేసీఆర్ చేతిలో మోసపోవద్దు. ప్రజల కోసం బ్రతికిన నాయకుడు వైయస్ఆర్ గారు. నేడు రాష్ట్రంలో వైయస్ఆర్ ప్రతి పథకాన్ని ఖూనీ చేశారు. ఫీ రీయంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ అన్ని పక్కన పెట్టారు. ఇంటికి పెద్ద కొడుకవుతానన్న కేసీఆర్ ఇంటికి ఒక్కరికే పెన్షన్ ఇస్తున్నాడు. ఒకరు తిని ఇంకొకరు పస్తులుండాలా? ఓటు అనేది ప్రజల చేతిలో ఉన్న ఆయుధం. ఓటును అమ్ముకోకుండా బాగా ఆలోచించి మీ కోసం పని చేసే నాయకుల కోసం ఓటు వేయండి.

తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి పాలన తీసుకురావడానికే వైయస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టాం. వైయస్ఆర్ సంక్షేమ పాలన మీ ఇంటికి చేరుస్తాని మీకు మాటిస్తున్నా. వ్య‌వ‌సాయాన్ని మేం పండుగ చేస్తాం. రైతులు, కౌలు రైతులు, రైతు కూలీల సంక్షేమం కోసం మేం కృషి చేస్తాం. మ‌హిళ‌ల‌ను మేం ఆర్థికంగా నిల‌బెడ‌తాం. నిరుద్యోగుల ఉద్యోగాల కోస‌మే మేం మొట్ట‌మొద‌టి సంత‌కం పెడ‌తాం. తెలంగాణ అభివృద్ధి కోసం ప‌ని చేస్తామ‌ని మాటిస్తున్నా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com