ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతోన్న వన్డే సిరీస్ చివరి మ్యాచ్ లో ఆతిథ్య బంగ్లాదేశ్ ఏడు వికెట్లతో ఘన విజయం సాధించింది. తొలి రెండు వన్డేల్లో విజయం సాధించి ఇప్పటికే సిరీస్ ను ఆఫ్ఘన్ గెల్చుకున్న విషయం విదితమే.
చత్తోగ్రామ్ లోని జహుర్ చౌదరి స్టేడియం వేదికగా జరిగిన నేటి మ్యాచ్ లో ఆఫ్ఘన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టులో అజ్మతుల్లా-56; కెప్టెన్ షాహిది-22; ముజీబ్-11 రన్స్ చేశారు. 45.2 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బంగ్లా బౌలర్లలో షోరిఫుల్ ఇస్లామ్ 4; తస్కిన్ అహ్మద్, తైజుల్ ఇస్లామ్ చెరో 2; మెహిదీ హసన్, షకీబ్ చెరో వికెట్ పడగొట్టారు.
లక్ష్య సాధనలో బంగ్లాదేశ్ 28 పరుగులకు 2 వికెట్లు (మొహమ్మద్ నయీం- డకౌట్; నజ్ముల్ హోస్సేన్-11) కోల్పోయింది. షకీబ్ అల్ హసన్ 39 రన్స్ చేసి వెనుదిరిగాడు. కెప్టెన్ లిట్టన్ దాస్- 53; తౌహిద్-22 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. 23.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యం చేరుకుంది. ఆఫ్ఘన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూఖి 2; మొహమ్మద్ నబి 1 వికెట్ పడగొట్టారు.
బంగ్లా బౌలర్ షోరిఫుల్ ఇస్లామ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’…. ఆఫ్ఘన్ బౌలర్ ఫజల్ హక్ ఫారూఖి కు ‘ ప్లేయర్ అఫ్ ద సిరీస్’ లభించాయి.