Sunday, January 19, 2025
HomeTrending Newsఓమిక్రాన్ ఎంత ప్రమాదకరం ?

ఓమిక్రాన్ ఎంత ప్రమాదకరం ?

Omicron : దక్షిణాఫ్రికా లో వేగం గా విస్తరిస్తోంది. నవంబర్ 25 న 2500 కేసులు ఉంటే అది ఇప్పుడు అయిదు రెట్లు పెరిగింది. నవంబర్ 25 న వంద మరణాలు ఉంటే ఇప్పుడు అది ఒక మరణానికి పడిపోయింది. కమ్యూనిటీ వ్యాప్తి కేవలం దక్షిణాఫ్రికా లో జరుగుతోంది. ఇంగ్లాండ్ , ఇండియా లాంటి దేశాల్లో అక్కడక్కడా కేసులు వస్తున్నాయి. కానీ ఓమిక్రాన్ బారిన పడిన వారిలో డెబ్భై ఎనభై శాతానికి కనీసం జలుబు లాంటి లక్షణం కనబడడం లేదు. టెస్ట్ ల లో మాత్రం పాజిటివ్ వస్తోంది. మిగతా వారికి మైల్డ్ లక్షణాలు. తీవ్రంగా జబ్బు పడిన వారు ఇప్పటిదాకా ఎవరూ లేరు. మరణం అసలు లేదు .

ఇండియా లో మైల్డ్ వేవ్ రానుందా ?

డెల్టా మార్చ్ – మే నెలలో విస్తరించింది. దాని అంటి బాడీ లు దాదాపుగా అయిపోయాయి. కాబట్టి జనవరి లో మైల్డ్ వేవ్ రానుంది అని అంచనా కడుతున్నారు. ఇప్పటిదాకా బెంగళూరు లాంటి చోట్ల ఓమిక్రాన్ బారిన పడిన వారి వల్ల ఎవరూ ఇన్ఫెక్ట్ కాలేదు. బెంగళూరు డాక్టర్ కు సంబంధించి పదుల సంఖ్యలో ప్రైమరీ , సెకండరీ కాంటాక్ట్స్ ను చెక్ చేసినా నెగటివ్ గానే వచ్చింది. కాకపోతే జనవరి కి యాంటీబోడీ లు అయిపోయే మాట వాస్తవం. కానీ వ్యాధి సంక్రమణ జరగొచ్చు. మోర్బీడిటీ అంటే వ్యాధి తీవ్రత ఎంత ఉంటుంది అనేది ప్రశ్న. ఇండియన్స్ లో అత్యధిక శాతానికి టి సెల్స్ రక్షణ వుంది. దీనికి తోడు ఇప్పుడు వచ్చింది జలుబు- కరోనా సంకర జాతి వైరస్. ఇది సోకితే నూటికి తొంబై శాతానికి కనీసం ఒళ్ళు నలత  ఉండదు. ఇమ్మ్యూనిటి బాగా దెబ్బ తిన్న వారు తప్పించి ఎవరూ ఖాయిలా పడే అవకాశం లేదు. అలాంటప్పుడు దాన్ని వేవ్ అనడం ఎంత వరకు కరెక్ట్ ? అసలు వేవ్ అంటే అంబులెన్సు లు.. ఆసుపత్రి ముందు క్యూలు కదా ? ఇప్పడు ఇక పై అలాంటి సీన్స్ వుండవు. గతంలో జలుబు వచ్చినట్టు కాస్త ఒళ్ళు నలతో వచ్చి పోతూ ఉంటుంది .

ఎప్పటి దాక ఇలా వచ్చి పోతూ ఉంటుంది ? మన జీవిత కాలం వచ్చి పోతూ ఉంటుంది. రెండేళ్ళకొక సారి సోకుతూ ఉంటుంది. స్పానిష్ ఫ్లూ వైరస్ కూడా ఇలాగే మన మధ్య వుంది. దానికంటే పాత వైరస్ లది కూడా అదే బాట.

మరి ఓమిక్రాన్ మ్యుటేషన్ కు గురికాదా ?

ఎందుకు కాదు. మ్యుటేషన్ లు నిత్యకృత్యాలు. మ్యుటేషన్ ల వల్ల వైరస్ మరింత బలహీన పడుతుంది. ఇది జ్యోతిష్యమా ? కాదు స్వామీ.. వ్యాధి సంక్రమణ శాస్త్రం. వైరస్ మనిషికంటే పురాతనమైనది. ఎన్నో వైరస్ లు పుట్టాయి. మనిషి దాన్ని జయించాడు. మ్యుటేషన్ , డైరెక్షనల్ natural సెలక్షన్ ల ఇంటర్ ప్లే ద్వారా ఇది జరుగుతుంది. ఇది సైన్స్. అసలు వైరస్ కు మందు లేదు. రాదు. వైరస్ ను జయించేది మన ఇమ్మ్యూనిటి మాత్రమే. వాక్సిన్ అనేది కృత్రిమ ఇమ్మ్యూనిటిని సాధించుకునే మార్గం మాత్రమే. దాన్ని వద్దు అనడం లేదు కానీ అసలు దృష్టి సహజ ఇమ్మ్యూనిటిని సాధించడంపై ఉండాలి.

Also Read : బ్రిటన్ లో 50 వేల కరోనా కేసులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్