మలేసియా మాస్టర్స్ -2022 టోర్నమెంట్ సెమీ ఫైనల్లో భారత స్టార్ ఆటగాడు హెచ్ ఎస్ ప్రణయ్ పరాజయం పాలయ్యాడు. నేడు జరిగిన మ్యాచ్ లో హాంగ్ కాంగ్ ఆటగాడు, 8వ ర్యాంకింగ్ లో ఉన్న అంగుస్ కా లాంగ్ చేతిలో 21-17; 9-21; 17-21 తేడాతో ఓటమి చెందాడు.
మొదటి సెట్ గెల్చుకున్న ప్రణయ్ రెండో సెట్ లో నిరాశ పరిచాడు. మూడో సెట్ లో ప్రత్యర్ధికి గట్టి పోటీ ఇచ్చినా చివరకు ఓటమి మిగిలింది.
బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బి.డబ్ల్యూ.ఎఫ్.) వరల్డ్ టూర్ టోర్నమెంట్లలో ఈ ఏడాది ఇప్పటి వరకూ జరిగిన 12 టోర్నమెంట్లలో పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ ఒకసారి, మహిళల సింగిల్స్ లో పివి సింధు రెండు సార్లు మాత్రమే విజేతలుగా నిలిచారు. గత నాలుగైదు టోర్నమెంట్లలో భారత ఆటగాళ్ళు కేవలం సెమీస్ తోనే నిష్క్రమిస్తున్నారు.