Life Sciences Sector లైఫ్‌సైన్సెస్ సెక్టార్‌లో హైదరాబాద్ మరింత పురోగమిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే ఉన్నత ప్రమాణాలతో జీనోమ్ వ్యాలీ నడుస్తున్నదని చెప్పారు. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెర్రింగ్ ఔషధరంగ సంస్థ ఏర్పాటు చేసిన ఫెర్రింగ్ ఫార్మాస్యూటికల్స్‌ను మంత్రి కే తారకరామారావు ఈ రోజు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యం కోసం ఫెర్రింగ్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. 30 బిలియన్ యూరోలతో ఫెర్రింగ్ కంపెనీ ఏర్పాటయిందన్నారు.టీఎస్‌ఐఐసీ బయోటెక్ పార్కులో ఏర్పాటైన ఈ ప్లాంట్ ద్వారా 110 మందికి ఉద్యోగాలు లభించాయని చెప్పారు. స్విట్జర్లాండ్ వేదికగా కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతాయని వెల్లడించారు. ఇందులో తల్లీబిడ్డల ఆరోగ్యానికి అవసరమైన మందులు తయారవుతాయని వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఫెర్రింగ్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 30 బిలియన్ యూరో పెట్టుబడితో ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ ద్వారా 110 మందికి ఉద్యోగాలు కల్పించారు. స్విజ్జర్లాండ్ వేదికగా ఈ కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతాయి. తల్లి, బిడ్డల ఆరోగ్యానికి కావాల్సిన మందులు ఇక్కడ తయారు చేస్తారన్నారు. మహిళల ఆరోగ్య కోసం ఫెర్రింగ్ ఫార్మా కృషి చేయడం అభినందనీయం. జీనోమ్ వ్యాలీ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఉన్నతమైన ప్రమాణాలతో కొనసాగుతుంది. లైఫ్ సైన్సెస్ సెక్టార్ లో హైదరాబాద్ మరింత పురోగమిస్తోంది. వచ్చే ఏడాది నాటికి ఈ రంగంలో హైదరాబాద్ మరింత ముందుంటుందన్నారు. లైఫ్ సైన్సెస్ సెక్టార్ లో హైదరాబాద్ ప్రపంచ దేశాలతో పోటీపడుతుందన్నారు మంత్రి కేటీఆర్. ఫెర్రింగ్ సంస్థకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తుందన్నారు.
Also Read : ఈ-కామర్స్‌పై జాతీయ విధానాన్ని తేవాలి : కేటీఆర్