Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్ఐపీఎల్: గుజరాత్ జోరుకు హైదరాబాద్ బ్రేక్

ఐపీఎల్: గుజరాత్ జోరుకు హైదరాబాద్ బ్రేక్

2nd win for SRH: ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మొదటి రెండు మ్యాచ్ లలో పరాజయం పాలై నిరాశపరిచిన హైదరాబాద్ ఆ తర్వాత పుంజుకొని మూడో మ్యాచ్ లో చెన్నైపై విజయం సాధించగా, నేడు గుజరాత్  టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సత్తా చాటింది.  బౌలర్లు సమిష్టి గా రాణించగా, బ్యాటింగ్ లో కెప్టెన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ మరోసారి చెలరేగి ఆడారు.

నవీ ముంబై లోని డా. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (50) ; అభినవ్ మనోహర్(35); మాథ్యూ వాడే(19) మాత్రమే రాణించారు, మిగిలిన వారు తక్కువ స్కోరుకే ఔటయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 162 పరుగులు చేసింది.  హైదరాబాద్ బౌలర్లలో భువీ, నటరాజన్ చెరో రెండు; మార్కో జాన్సేన్, ఉమ్రాన్ మాలిక్ చెరో వికెట్ పడగొట్టారు.

హైదరాబాద్ తొలి వికెట్ కు 64పరుగులు చేసింది, 32 బంతుల్లో 6 ఫోర్లతో 42 పరుగులు చేసిన అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. రెండో వికెట్ కు విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి 65 పరుగులు జోడించారు. విలియమ్సన్ 46 బంతుల్లో  2 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో ఔటయ్యాడు. ఒక ఫోర్, ఒక సిక్సర్ తో 17 పరుగులు చేసి మంచి ఊపుమీదున్న త్రిపాఠి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. నికోలస్ పూరన్, ఏడెన్ మార్ క్రమ్ లు మరో వికెట్ పడకుండా, ఐదు బంతులు మిలిగి ఉండగానే విజయం అందించారు. పూరన్ 34;  మార్ క్రమ్12  పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

కేన్ విలియమ్సన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

Also Read : ఐపీఎల్: లక్నో పై రాజస్థాన్ గెలుపు

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్