Thursday, June 18, 2026
Homeసినిమావీరమల్లుకు హైపర్ ఆది సాయం చేశాడా..?

వీరమల్లుకు హైపర్ ఆది సాయం చేశాడా..?

పవన్ కళ్యాణ్‌, క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ పీరియాడిక్ మూవీ ‘హరి హర వీరమల్లు‘. ఇందులో పవన్ కళ్యాణ్ కు జంటగా నిధి అగర్వాల్ నటిస్తుంది. ఏఎం రత్నం ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ పై కీలక సన్నవేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే బాగా ఆలస్యం అయిన ఈ చిత్రాన్ని సమ్మర్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే… ఈ సినిమాకి బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ రాశారు. ఆయనకు దర్శకుడు క్రిష్ తో మంచి అనుబంధం ఉంది. ఇప్పటి వరకు క్రిష్ చిత్రాలు అన్నింటికీ ఆయనే డైలాగులు రాశారు. హరి హర వీరమల్లుకు కూడా ఆయనే డైలాగ్స్ రాశారు కానీ.. కొన్ని కామెడీ ఎపిసోడ్స్ ఉన్నాయట. వాటి కోసం చిత్ర‌బృందం హైప‌ర్ ఆది స‌హాయం తీసుకొంద‌ని టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాలో హైప‌ర్ ఆది కూడా కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నాడు. హైపర్ ఆది పంచ్ లు ఎలా ఉంటాయో.. ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

త‌న కామెడీ టైమింగ్‌, పంచ్‌లూ బాగుంటాయి. అందుకే.. కామెడీ సీన్ల వ‌ర‌కూ.. త‌న పంచ్‌లు కొన్ని యాడ్ చేసుకొన్నారని తెలిసింది. అవ‌న్నీ తెర‌ పై బాగా వ‌చ్చాయ‌ని తెలుస్తోంది. ఈ మూవీ కోసం క్రిష్ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది.క్రిష్ సరైన సక్సెస్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. మరి.. వీరమల్లు క్రిష్ ఆశించిన విజయాన్ని అందిస్తుందో లేదో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular