Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్గౌరవంగా భావిస్తున్నా: సిరాజ్

గౌరవంగా భావిస్తున్నా: సిరాజ్

Siraj With RCB:
ఐపీఎల్ లో బెంగుళూరు ప్రాంచైజీ తనను కొనసాగించాలని తీసుకున్న నిర్ణయంపై హైదరాబాదీ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. జట్టు యాజమాన్యం, సలహాదారులు, సహచర ఆటగాళ్లకు సిరాజ్ కృతజ్ఞతలు తెలియజేశారు.

కాగా, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్ వెల్, సిరాజ్ లను కొనసాగించాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) నిర్ణయించింది. ఐపీఎల్ మొదలుపెట్టిన నాటి నుంచీ విరాట్ కోహ్లీ బెంగుళూరుకు ఆడడంతో పాటు కెప్టెన్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే తర్వాతి సీజన్ కు కెప్టెన్ గా కొనసాగలేనని కోహ్లీ గత నెలలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. కెప్టెన్ గా కొనసాగక పోయినా ఐపీఎల్ ఆడినంత కాలం బెంగుళూరుతోనే ఉంటానని కోహ్లీ ప్రకటించాడు. ఈ నేపధ్యంలో కోహ్లీని 15 కోట్ల రూపాయల ధరతో తమతోనే ఉంచుకున్తున్నట్లు ఆర్సీబీ యాజమాన్యం ప్రకటించింది. గత సీజన్ నుంచి బెంగుళూరుకు ఆడుతోన్న గ్లెన్ మాక్స్ వెల్ ను రూ.11 కోట్ల ధరకు, హైదరాబాదీ సిరాజ్ ను రూ. 7 కోట్లకు కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.

సిరాజ్ 2018 నుంచి బెంగుళూరు తరఫున ఆడుతున్నాడు. అంతకుమూడు హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించినప్పటికీ బెంగుళూరులో చేరిన తర్వాతే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు, కెప్టెన్ కోహ్లీ కూడా సిరాజ్ కు మంచి ప్రోత్సాహం అందిస్తూ వస్తున్నారు. మరోసారి ఆర్సీబీ సిరాజ్ ను తమతో ఉంచుకున్తున్నట్లు ప్రకటించింది. దీనిపై సిరాజ్ స్పందిస్తూ  “నాపై విశ్వాసం ఉంచిన ఆర్సీబీ కుటుంబానికి నా ధన్యవాదాలు, మీ నమ్మకం నిలబెట్టేందుకు శాయశక్తులా కృషి చేశా, ఇది నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా, ఆర్సీబీ ప్రేక్షకులకు నేను చెబుతున్నదొకటే, మాకు మద్దతు ఇస్తుండండి, ప్రేమిస్తూ ఉండండి” అంటూ సందేశంలో పేర్కొన్నాడు.

Also Read : పివి సింధు, కిడాంబి శ్రీకాంత్ శుభారంభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్