Camera back only: అనిల్ రావిపూడి పేరు వినగానే ఆయన ఫస్టు మూవీ ‘పటాస్’ నుంచి ఇప్పటివరకూ తీసిన సినిమాలు కళ్లముందు కదలాడతాయి. ఇంతవరకూ తీసినవి తక్కువ సినిమాలే అయినా, అన్ని సినిమాలు కూడా ఒకదానికి మించి మరొకటి హిట్. కామెడీపై ఆయనకి మంచి పట్టుంది. జంధ్యాల తన గురువని చెప్పుకునే అనిల్, ఆయన తరహాలోనే ప్రతి పాత్రకి ఒక మేనరిజం సెట్ చేస్తూ ముందుకు వెళుతున్నాడు. కథ ఏదైనా కామెడీ పాళ్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన ‘ఎఫ్ 3‘ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవల కాలంలో దర్శకులు తమ సినిమాల్లో ఎక్కడో ఒకచోట తెరపై కనిపించి తమ ముచ్చట తీర్చుకుంటున్నారు. రాజమౌళి కూడా అందుకు మినహాయింపేమీ కాదు. అలాగే అనిల్ రావిపూడి కూడా. ‘ఎఫ్ 3’ సినిమాలోనూ ఒకచోట ఆయన కనిపించనున్నాడు. అప్పుడప్పుడు ఆయా వేదికలపై తనలోని నటుడిని బయటికి తీస్తూ ఉంటాడు. తెరపై కనిపించడానికి ఉత్సాహాన్ని చూపుతున్నాడు. దాంతో ఆయన నటన వైపుకు వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరిగుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయంపై అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు.
“నాకు నటన పట్ల ఆసక్తి ఉందనే మాట వాస్తవం. ఆర్టిస్టుగా కనిపించడానికి ఇష్టపడతాను. కానీ హీరోను అయిపోవాలనే కోరిక ఎప్పుడూ లేదు. అసలు ఆ దిశగా ఆలోచనే చేయలేదు. హీరోకి చాలా బరువు .. బాధ్యతలు .. టెన్షన్స్ ఉంటాయి. సినిమా ఫ్లాప్ అవుతుందా? .. హిట్ అవుతుందా? అసలు మన మార్కెట్ ఎంత ఉంది? ఇలాంటి బాధలన్నీ ఉంటాయి. అందువలన అలాంటి టెన్షన్స్ నేను పెట్టుకోదలుచుకోలేదు. మామూలు ఆర్టిస్ట్ గా అయితే ఓకే. సమయానికి వచ్చేసి .. చెప్పిన సీన్ చేసేసి .. డైలీ పేమెంట్ తీసుకుని వెళ్లిపోవచ్చు” అంటూ నవ్వేశాడు.
Also Read : దానికి ట్రిపుల్ డోస్ వినోదం ‘ఎఫ్ 3’లో వుంటుంది : వెంకటేష్