High dose: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3‘. డబుల్ బ్లాక్‌బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఎఫ్3 ‘ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27 న ఎఫ్ 3 ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైమౌతున్న నేపధ్యంలో హీరో విక్టరీ వెంకటేష్ మీడియాతో మాట్లాడారు. ఆ.. విశేషాలు ఆయన మాట‌ల్లోనే…

F3 Movie U Certificate

“నా ప్రతీ సినిమాని మొదటి సినిమాగానే భావిస్తాను. ప్రతీ సినిమాకి అలానే కష్టపడతాను. నా స్టార్ డమ్ ఇమేజ్ ని ఎప్పుడూ క్యారీ చేయను. ముఖ్యంగా కామెడీ ఎంటర్ టైనర్లు చేసినప్పుడు ఇలాంటి ఇమేజ్ ని క్యారీ చేయకూడదు. అప్పుడే నేచురల్ ఫ్లో బయటికి వస్తుంది. ‘ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు’, ‘అబ్బాయి గారు’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’.. ఇలా ఎన్నో చిత్రాలు ఎలాంటి ఇమేజ్ లెక్కలు వేయకుండా చేసినవే. సినిమా చేసినప్పుడు ఎక్కువ ఆలోచించను. సినిమాని నా పాత్రని ఎంజాయ్ చేస్తాను. బహుశా అనిల్ రావిపూడికి కూడా ఇదే అనిపించి ఉంటుంది. ఎఫ్ 3  ఔట్ పుట్ అద్భుతంగా వచ్చింది”

F3 Venkatesh

‘నారప్ప’, ‘దృశ్యం’ రెండూ సీరియస్ సినిమాలు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఓటీటీలో విడుదలయ్యాయి. ఎఫ్ 3తో మళ్ళీ థియేటర్ ఆడియన్స్ ని కలవడం ఆనందంగా వుంది. కామెడీ అనగానే ఒక ప్రత్యకమైన ఎనర్జీ వచ్చేస్తుంది. కాలేజీ రోజుల్లో ఉన్నట్లే అనిపిస్తుంది. నేను సహజంగానే అందరితోనూ సరదాగా ఉంటాను. నన్న ఇలా చూడటానికి ప్రేక్షకులు కూడా ఇష్టపడతారు. రెండేళ్ళ గ్యాప్ తర్వాత ఎఫ్ 3లాంటి బిగ్ ఎంటర్ టైనర్ తో రావడం ఆనందంగా వుంది. ఫ్యామిలీ తో కలసి ఇలాంటి ఎంటర్ టైనర్లు చూడటంలో ఓ కిక్ వుంటుంది. ఎఫ్ 2పెద్ద విజయం సాధించింది. ఆ సినిమాని, పాత్రలని ప్రేక్షకులంతా అభిమానించారు. ఎఫ్ 3 నుండి ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ వినోదం కోరుకుంటారు. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఎఫ్ 2కి ట్రిపుల్ డోస్ వినోదం ఎఫ్ 3లో వుంటుంది”

“దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మంచి డ్యాన్స్ నెంబర్స్ వున్నాయి. అలాగే శ్రీరామ్ డీవోపీ కూడా వండర్ ఫుల్ గా వుంది. ఎఫ్ 3లో నటీనటులు, టెక్నిషియన్లు అందరూ అద్భుతంగా చేశారు. ఎఫ్ 2లో వెంకీ మేనరిజం చాలా పాపులర్ అయ్యింది. పిల్లలు కూడా దాన్ని చేయడం చూసి నేనే సర్ ప్రైజ్ అయ్యా. ఇలాంటి సినిమాలు వాళ్లకి నచ్చుతున్నాయనే ఆనందం వుంది. నా త‌దుప‌రి చిత్రాల గురించి చెప్పాలంటే.. సితార, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ లో చేస్తున్నాను. ఈ బ్యాన‌ర్స్ లో చేసే సినిమాల‌కు ద‌ర్శ‌కులు ఎవ‌రు అనేది ఇంకా ఫైన‌ల్ కాలేదు. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాల‌తో ప్ర‌క‌టిస్తాను” అన్నారు.

Also Read : ఎఫ్ 3’లో పెరిగిన గ్లామర్ డోస్! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *