Wednesday, October 4, 2023
HomeTrending Newsఆంధ్రప్రదేశ్ లో 4 రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు

ఆంధ్రప్రదేశ్ లో 4 రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు

ఆంధ్రప్రదేశ్ శాసన సభకు ఎన్నిక కాబడిన సభ్యులచే రాజ్యసభకు నలుగురు (4) సభ్యుల ఎన్నికకు బుధవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. అమరావతి సచివాలయం అసెంబ్లీ భవనంలో రిటర్నింగ్ అధికారి మరియు రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి పి.వి. సుబ్బారెడ్డికి ఎన్నికలో పోటీచేసే అభ్యర్థులు వరుసగా వి.విజయ సాయిరెడ్డి,బీద మస్తాన్ రావు,ఎస్.నిరంజన్ రెడ్డి మరియు ఆర్.కృష్ణయ్య నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ నలుగురు నామినేషన్ పత్రాలతో పాటు వై.ఎస్.ఆర్.సి.పి. నుండి పొందిన ‘బి’ ఫార్ము, అఫడవిట్, సెక్యురిటీ డిపాజిట్ తదితర పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.రిటర్నింగ్ అధికారి పి.వి.సుబ్బారెడ్డి వీరి నావినేషన్ పత్రాలను పూర్తిగా పరిశీలించి వీరిచే ప్రతిజ్ఞ చేయించారు.


ఆంధ్రప్రదేశ్ శాసన సభకు ఎన్నిక కాబడిన సభ్యులచే రాజ్యసభకు ఎన్నుకోబడనున్న నాలుగు రాజ్యసభ సభ్యుల ఖాళీ స్థానాలకు నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు వచ్చిన నలుగురు అభ్యర్థులతో పాటు ప్రభుత్వ (ప్రజావ్యవహారాల) సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు మంత్రులు,శాసన సభ్యులు ఒక్కొక్క సభ్యునితో నలుగురు చొప్పున హాజరయ్యారు.

రాజ్యసభ సభ్యునిగా పోటీ చేసే అభ్యర్థులలో తొలిగా వి.విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేయగా వీరితో ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, మంత్రులు బొత్స సత్యనారాయణ,పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ప్రభుత్వ (ప్రజావ్యవహారాల) సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. తదుపరి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి బీద మస్తాన్ రావు తో పాటు ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా షేక్ బిపారి, మంత్రులు బొత్స సత్యనారాయణ,పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మేరుగు నాగార్జున హాజరయ్యారు.

మూడో అభ్యర్థి ఎస్.నిరంజన్ రెడ్డి తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, జోగి రమేష్, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజు హాజరయ్యారు. నాలుగో అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆర్.కృష్ణయ్య తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు మరియు మేరుగు నాగార్జున హాజరయ్యారు.

Also Read : జగన్ కు విజయసాయి, కృష్ణయ్య కృతజ్ఞతలు 

NewsDesk
NewsDesk
'ఐ'ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Ramaraju on జనం భాష
Ramaraju on జనం భాష
Radhakrishna Regalla on లోహం- వ్యామోహం
ఆకతాఈ శ్రీ on తెలుగు వెలుగు
Indrasen Bejjarapu on మనసున్న పులి
ఎమ్వీ రామిరెడ్డి on మనసున్న పులి
ఫణీన్ద్ర పురాణపణ్డ on హంపీ వైభవం-1
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Dr MVJM RAMA PRASAD MANDA on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-1
తనికెళ్ల శ్రీనివాస్ on రెండు వ్రాతప్రతులూ అపూర్వమే !
కర్రా వెంకటరత్నం on మా నాన్న