Thursday, April 25, 2024
HomeTrending Newsఅమలాపురం గొడవకు ప్రభుత్వానిదే బాధ్యత: పవన్

అమలాపురం గొడవకు ప్రభుత్వానిదే బాధ్యత: పవన్

Govt. failure: కోనసీమ జిల్లాకు ప్రత్యేక విధానాన్ని ఎందుకు అమలు చేయాలసి వచ్చిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొత్త జిల్లాలు ప్రకటించినప్పుడే  మిగతా జిల్లాలతో  పాటే కోనసీమకు కూడా పేరు పెట్టి ఉంటే ఇంత రాద్దాంతం జరిగి ఉండేది కాదన్నారు. ఈ నెల 18న అంబేద్కర్ పేరు పెడుతూ గెజిట్ విడుదల చేస్తూ ౩౦ రోజుల సమయం ఎందుకు ఇచ్చారని నిలదీశారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ మీడియాతో మాట్లాడారు. కోనసీమ ప్రజలు భావోద్వేగాలకు లోను కాకుండా సంయమనం పాటించాలని పిలుపు ఇచ్చారు.

కులాల మధ్య గొడవ రావణ కాష్టం లాంటిదని,…  విద్య, ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాల్సిన యువత ఇలాంటి ఆందోళనల్లో భవిష్యత్తు పాడు చేసుకోవద్దని హితవు పలికారు.

పవన్ మీడియా సమావేశంలో ముఖ్యాంశాలు:

  • అన్ని జిల్లాలకు ఒక విధానం, కోనసీమకు మరొకటి ఎందుకు?
  • గెజిట్ ప్రకటించిన తరువాత ఎందుకు 30 రోజులు సమయం ఇచ్చారు?
  • అల్లర్లు సృష్టించడానికే ఉద్దేశ పూర్వకంగా ఈ గడువు ఇచ్చారని అనుకోవాలా?
  • అభ్యంతరాలు ఉంటే  తెలియజేయాలని, అదికూడా వ్యక్తులుగా రావాలని… సమూహాలుగా వద్దని చెప్పడం ప్రేరేపించడం కాదా?
  • అక్కడి ప్రజల భావోద్వేగాలు తెలిసీ కూడా పోలీసులు ఎందుకు ప్రేక్షక  పాత్ర పోషించారు
  • కాకినాడ ఎమ్మెల్యే నన్ను తిడితే, నేను ఆ ప్రాంతంలో పర్యటించాలని అనుకుంటే  జిల్లా అంటా 144సెక్షన్ విధించారు
  • అలాంటిది కోనసీమ జిల్లా పేరు మార్చిన తరువాత పోలీసులు ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు
  • పోలీసులు అప్రమత్తంగా లేకపోవడం ముందస్తు ప్రణాళికలో భాగమే
  • హత్య కేసు నుంచి  ఎమ్మెల్సీని తప్పించడానికే ఈ అల్లర్లు
  • జిల్లాకు పేరు పెట్టడాన్ని వ్యతిరేకించడం అంటే ఆ మహనీయుడిని వ్యతిరేకించడం కాదు
  • కడప జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టి ఉండొచ్చు కదా?
  • రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన వ్యక్తి  పొట్టి శ్రీరాములు పేరును ఓకే జిల్లాకు పరిమితం చేశారు.
  • వైఎస్సార్ మరణించిన తరువాత కడప జిల్లాకు అయన పేరు పెట్టారు, తరువాత వైఎస్సార్ కడప పేరు మార్చి వైయస్సార్ జిల్లాగా మార్చారు.
  • సముద్రం ఉన్న జిల్లాకు కృష్ణా జిల్లా అని పేరు పెట్టారు.
  • కృష్ణా నది ఎక్కువ ఉన్న ప్రాంతానికి ఎన్టీఆర్ పెట్టారు.
  • సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మంత్రులు, వైసీపీ నేతలు నానా హడావుడి చేశారు.
  • కులాల సమీకరణ మీదే రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి
  • అల్లర్లకు జనసేన పార్టీని బాద్యుడిని చేయడాన్ని ఖండిస్తున్నాం
  • దళితుల మీద అంత ప్రేమ ఉంటే వారికి దక్కాల్సిన సబ్ ప్లాన్ నిధులు, విదేశీ విద్య, వారి పొలాలకు ఉచిత బోర పథకం లాంటి ఎన్నో పథకాలు ఆపేశారు.
  • అమలాపురం ప్రజలు సంయమనం పాటించాలి
  • కులాల గొడవలు జరిగితే రాష్ట్రం అభివృద్ధి జరగడం సాధ్యం కాదు
  • ఈ అల్లర్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

Also Read : అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత

RELATED ARTICLES

Most Popular

న్యూస్