Sunday, January 19, 2025
Homeసినిమా బాహుబ‌లి 3 అప్ డేట్ ఇచ్చిన రాజ‌మౌళి

 బాహుబ‌లి 3 అప్ డేట్ ఇచ్చిన రాజ‌మౌళి

Bahubali-3: ప్ర‌భాస్, రానా, అనుష్క‌, త‌మన్నా, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం బాహుబ‌లి. ఈ సినిమా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికీ తెలిసిందే. తెలుగు సినిమా స‌త్తాను చాటి చెప్పి ప్ర‌పంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేశారు రాజ‌మౌళి. బాహుబ‌లి, బాహుబ‌లి 2 చిత్రాలు చ‌రిత్ర సృష్టించ‌డంతో బాహుబ‌లి 3 వ‌స్తే.. బాగుంటుంద‌ని ప్రేక్ష‌కాభిమానులు ఎప్ప‌టి నుంచో కోరుకుంటున్నారు.

అయితే.. ఇటీవల రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్ల సమయంలో ఈ విషయం పై ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు. బాహుబ‌లి 3 వ‌స్తే బాగుంటుంద‌ని.. అయితే.. అది రాజ‌మౌళి చేతిలో ఉంద‌ని చెప్పారు. తాజాగా రాజమౌళి ఈ విషయం పై అప్ డేట్ ఇచ్చారు. రాజమౌళి తన తాజా ఇంటర్వ్యూలో బాహుబలి 3 చేయడానికి ప్రభాస్, నేను, నిర్మాతలు చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాం. ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అయితే.. దాని గురించి నేను ఇప్పుడే పెద్దగా ఏమీ మాట్లాడలేను కానీ.. బాహుబ‌లి 3 కార్య‌రూపం దాల్చ‌డానికి టైమ్ ప‌డుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించి అప్ డేట్ త్వ‌ర‌లో ఇస్తాను అన్నారు. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత రాజ‌మౌళి మ‌హేష్ బాబుతో సినిమా చేయ‌నున్నారు. ఈ సినిమాకే ఎక్కువ టైమ్ ప‌డుతుంది. ఆత‌ర్వాత అంటే.. బాహుబ‌లి 3 కి చాలా టైమ్ ప‌ట్ట‌చ్చు.

ఇవి కూడా చదవండి: దూసుకెళుతున్న ఆర్ఆర్ఆర్ ఎత్త‌ర జెండా పాట‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్