Sunday, June 14, 2026
Homeసినిమాసైతాన్ ఇంత సక్సెస్ అవుతుంది అనుకోలేదు - డైరెక్టర్ మహి వి రాఘవ

సైతాన్ ఇంత సక్సెస్ అవుతుంది అనుకోలేదు – డైరెక్టర్ మహి వి రాఘవ

డైరెక్టర్ మహి వి రాఘవ్ తెరకెక్కించిన క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ‘సైతాన్’. వెన్నులో వణుకు పుట్టించే క్రైమ్, వయలెన్స్ అంశాలతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సందర్భంగా సైతాన్ వెబ్ సీరీస్ యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ మహి వి రాఘవ్ మాట్లాడుతూ… సైతాన్ వెబ్ సీరీస్ సేవ్ ది టైగర్స్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ విజయం సాధించింది. ఈ విజయం మేము ఊహించలేదు. ప్రతి ఆర్టిస్ట్ , టెక్నీషియన్ ఈ సీరీస్ కోసం కష్టపడి పని చేశారు. మ్యూజిక్, కెమెరా వర్క్, డైలాగ్స్, ఆర్ట్ ఇలా ప్రతి డిపార్ట్మెంట్ కు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. త్వరలో సేవ్ టైగర్స్ కు కొనసాగింపు ఉంటుంది, అలాగే సైతాన్ కు కూడా కొనసాగింపు ఉంటుంది. అలాగే త్వరలో తాను దర్శకత్వం వహించిన ‘సిద్దా లోకం ఎలా ఉంది నాయనా’ విడుదల కాబోతోందని తెలిపారు.

నటి సెల్లి మాట్లాడుతూ… సైతాన్ సీరీస్ లో నాకు సావిత్రి పాత్రను ఇచ్చిన దర్శకుడు మహి గారికి కృతజ్ఞతలు. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆధరిస్తాని ఈ సీరీస్ ద్వారా ప్రూవ్ అయ్యింది. భవిషత్తులో మరిన్ని మంచి రోల్స్ లో మీ ముందుకు వస్తానని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular