Sunday, January 19, 2025
Homeసినిమా'యానిమల్' ట్రైలర్ చూస్తే మెంటలెక్కిపోయింది: మహేశ్ బాబు

‘యానిమల్’ ట్రైలర్ చూస్తే మెంటలెక్కిపోయింది: మహేశ్ బాబు

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ హీరోలు .. సౌత్ దర్శకులతో సినిమాలు చేయడానికి ఎంతమాత్రం వెనకాడటం లేదు. అలాగే ఆ సినిమాల ప్రమోషన్స్ కోసం తెలుగు ప్రేక్షకుల ముందుకు ఉత్సాహంగా వస్తున్నారు. అందుకు మరో ఉదాహరణగా ‘యానిమల్’ సినిమా కనిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో అనిల్ కపూర్ .. రణ్ బీర్ కపూర్ కనిపించారు. నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో సందడి చేశారు. ఈ ఫంక్షన్ కి రాజమౌళి – మహేశ్ బాబు చీఫ్ గెస్టులుగా రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

రణ్ బీర్ కపూర్ కి తాను పెద్ద అభిమానిననీ, ఈ సినిమా టీజర్ చూసిన దగ్గర నుంచి తనలో ఆసక్తి పెరిగిపోయిందని రాజమౌళి అన్నారు. కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసే దర్శకులలో రామ్ గోపాల్ వర్మ తరువాత సందీప్ వంగా కనిపిస్తారని చెప్పారు. ఇక మహేశ్ బాబు మాట్లాడుతూ, తాను కూడా రణ్ బీర్ కపూర్ కి అభిమానినని అన్నారు. ఈ సినిమా ట్రైలర్ చూసిన తరువాత తనకి మెంటలెక్కి పోయిందని చెప్పారు. రష్మిక గురించి ఒక్క మాటలో చెప్పలేమనీ, తను అన్ని భాషల్లోను బిజీగా ఉందని అన్నారు.

తాను తన ఫస్టు సినిమాను తెలుగులోనే చేశాననీ, అది ‘వంశవృక్షం’ సినిమా అని అనిల్ కపూర్ చెప్పారు. అలా తెలుగు ప్రేక్షకులతో తనకి ఎప్పటి నుంచో అనుబంధం ఉందని అన్నారు. 45 ఏళ్లలో తాను మరోసారి తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చానని అంటూ ఆయన తెలుగులో మాట్లాడటం విశేషం. ఇక రష్మిక మాట్లాడుతూ .. ‘యానిమల్’ ట్రైలర్ చూస్తే కాస్త వైలెంట్ గా కనిపించినా, ఇది ఫ్యామిలీ డ్రామా అనీ, మంచి ఎమోషన్స్ తో నడుస్తుందని అన్నారు. డిసెంబర్ 1న ఈ సినిమా థియేటర్స్ కి రానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్