Tuesday, February 27, 2024
HomeTrending Newsప్రజలే జగన్ బలం-మనందరికీ ఆత్మబలం: రాజన్నదొర

ప్రజలే జగన్ బలం-మనందరికీ ఆత్మబలం: రాజన్నదొర

ప్రజలే జగన్ బలం అని, మనందరికీ జగన్ ఆత్మబలం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పీడిక రాజన్నదొర అన్నారు. కులం, మతం, రాజకీయం, వర్గాలు లేకుండా అందరికీ మేలు చేయడానికే జగన్ నాలుగున్నరేళ్లగా పరితపిస్తున్నారన్నారని ప్రశంసించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో విజయంవంతంగా సాగుతున్న సామాజిక సాధికార బస్సు యాత్రకు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో జనం నీరాజనాలు పలికారు. చిలకపాలెం జంక్షన్ లో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగసభకు రాజన్నదొరతో పాటు  స్పీకర్ తమ్మినేని సీతారామ్, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, వైెఎస్సార్సీపీ రీజనల్ కోర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు హాజరయ్యారు. రాజన్న దొర మాట్లాడుతూ, ఎచ్చెర్ల సామాజిక సాధికార యాత్రకు వచ్చిన జనమే టీడీపీకి హెచ్చరికలు జారీ చేస్తోందన్నారు. చేయి చేయి కలిపి ఏకమై జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.

ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ మాట్లాడుతూ  రాష్ట్ర చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో అన్ని వర్గాల ప్రజలకు చేయూతనిస్తూ సంక్షేమ పాలనను జగన్ చేస్తున్నారని కొనియాడారు. ప్రతిపక్షాలు అనేక కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ జగన్ సీఎంగా ఓడించాలని చూస్తున్నారని, ప్రజలంతా ఆలోచన చేసి ఈ దుర్మార్గపు ఆలోచనతో వస్తున్న వారిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మరోసారి జగన్ ను గెలిపించుకోవడం ద్వారా ఇప్పటి సంక్షేమ పాలనను కొనసాగించుకుందామని కోరారు.

తాడిపత్రిలో 

ఇచ్చిన మాట ప్రకారమే ఎంపి సీట్లలోను, పదవుల్లోను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సిఎం జగన్ అగ్రస్థానం ఇచ్చారని, మాటిస్తే తప్పని నైజానికి ఇదే నిదర్శనమని అనతపురం లోక్ సభ సభ్యుడు తలారి రంగయ్య స్పష్టం చేశారు.  రాయలసీమ జిల్లాల్లో ఎనిమిది పార్లమెంటు సీట్లు ఉంటే అందులో ఐదు బీసీ, ఎస్సీలకే జగన్ కేటాయించారని వివరించారు. ఏమాత్రం రాజకీయ, ఆర్థిక బలం లేని తమ లాంటి వాళ్ళం ఎంపీలు, ఎమ్మెల్యేలం అయ్యామంటే అది జగనన్న చలవేనని కొనియాడారు. తాడిపత్రి నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు వేలాదిగా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, ఉషశ్రీచరణ్, ఎంపీలు నందిగం సురేష్, తలారి రంగయ్య, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ సామాజిక న్యాయమంటే జగనన్న అని, పుస్తకాల్లో మాత్రమే ఉన్న సామాజిక సాధికారతను ఆచరణలోకి తీసుకొచ్చారని ప్రశంసించారు. జగన్ లాంటి మంచి నాయకుడి వెంట మనం ఉండటం ఎంతో అవసరమని ప్రజలకు సూచించారు.

ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • గతంలో పాలకులెవరూ ఎప్పుడూ సామాజిక న్యాయం అన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
  • జగనన్న హయాంలోనే సామాజిక న్యాయమన్నది చూస్తున్నాం.
  • మన అనంతపురం జిల్లావరకు చూసుకున్నా, ఇక్కడ బీసీ మంత్రులున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్, మేయర్‌లున్నారు. కార్పొరేషన్లలోనూ బడుగు, బలహీనవర్గాలకే పెద్దపీట వేశారు జగనన్న.
  • ఈ నియోజకవర్గంలో టీడీపీ రాజకీయం చూస్తే అసహ్యమేస్తుంది. పేదలకు, అణగారిన వర్గాలకు చేసే ప్రతి మంచి పనికీ అడ్డుపడుతోంది.

  • ఆ టీడీపీ నాయకులెవరో మీకు తెలుసు. టీడీపీ పైస్థాయిలో ఎలా దోచుకో…దాచుకో సిద్ధాంతాన్ని అనుసరిస్తోందో..అదే తరహాలో ఇక్కడ పచ్చ సోదరులు పనిచేస్తున్నారు. తాడిపత్రిలో వారి అరాచకాలకు అంతులేదు.
  • జగనన్న ఆదర్శాలు, ఆలోచనలకనుగుణంగా నేను ముందుకు సాగుతున్నాను.
  • బడుగు, బలహీనవర్గాలకు అండాదండగా ఉండటం మన పార్టీ సిద్ధాంతం.
  • సామాజిక న్యాయం మన పార్టీ శ్వాస. సామాజిక సాధికారతే మన పార్టీ ధ్యాస. జగనన్న బాటలోనే మనమంతా.
RELATED ARTICLES

Most Popular

న్యూస్