Saturday, January 18, 2025
HomeTrending Newsఫ్లోరిడాలో కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ

ఫ్లోరిడాలో కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ

అమెరికాలో వచ్చిన అత్యంత తీవ్రమైన తుపానుల్లో ఒకటైన ఇయాన్ ఫ్లోరిడాలో విధ్వంసం సృష్టిస్తోంది. ఫ్లారిడా నైరుతీ ప్రాంతంలో బుధవారం తీరాన్ని దాటిన హరికేన్ ఇయాన్ మొత్తం ఆ రాష్ట్రాన్ని వర్షాలతో ముంచెత్తింది. నడుము లోతు నీళ్లలో షార్క్ లు ఈదుతున్న దృశ్యాలను, ఒక జర్నలిస్ట్ బలమైన గాలులకు కొట్టుకుపోతున్న దృశ్యాలను కొందరు స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

హరికేన్ ఇయాన్ ను కేటగిరీ 4 తుపానుగా అధికారులు నిర్ధారించారు. ఈ తుపాను ధాటికి గంటకు 241 కిమీల వేగంతో వస్తున్నా బలమైన గాలులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ గాలులు తీర ప్రాంతంలో గంటకు 665 కిమీల వేగంతో వీచాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఫ్లోరిడా వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మందికి విద్యుత్ సౌకర్యం నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన గాలుల ధాటికి ఒక ఆసుపత్రి పై కప్పు ఎగిరిపోయింది. చెట్లు పడిపోయాయి. ఫ్లారిడా తీరంలో 8 నుంచి 10 మీటర్ల ఎత్తులో అలలు తీర ప్రాంతంపైకి దూసుకువస్తున్నాయి.

ఫ్లోరిడాలో తీరం దాటే ముందు ఈ హరికేన్ క్యూబాను కూడా అస్తవ్యస్తం చేసి వచ్చింది. అక్కడి విద్యుత్ వ్యవస్థను నాశనం చేసింది. తుపాను కారణంగా ఇద్దరు చనిపోయారు. క్యూబా నుంచి అమరికా వైపు వస్తున్న వలస కార్మికుల బోటు నీటిలో మునిగిపోవడంతో 20 మంది క్యూబ పౌరులు గల్లంతయ్యారు. ఫ్లోరిడాలో ప్రభుత్వం సహాయ చర్యలను ప్రారంభించింది. వైద్య సహాయం, తాగునీరు, ఆహారం అందించేందుకు అన్నీ సిద్ధం చేసింది. ఫ్లోరిడా ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్