Saturday, January 18, 2025
HomeTrending Newsకు.ని వికటించి మరో ఇద్దరు మహిళల మృతి

కు.ని వికటించి మరో ఇద్దరు మహిళల మృతి

కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారిలో ఇద్దరు మహిళలు నిన్న మృతి చెందగా తాజాగా మరో ఇద్దరు చనిపోయినట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ రోజు వెల్లడించారు. కుని పరీక్షలతో మహిళలు చనిపోవటంపై ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 25న ఇబ్రహీంపట్నం పరిధిలో 34 మందికి DBL (డబుల్ పంచర్ లాప్రోస్కాపి) నిర్వహించామని, కుటుంబ నియంత్రణకు సంబంధించి దేశ వ్యాప్తంగా DBL అడ్వాన్స్ మెథడ్ వాడుతున్నారని తెలిపారు.

ఇబ్రహీంపట్నంలో మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని, ఇందులో నలుగురు మరణించారు. ఇది దురదృష్టకరమన్న్నారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల పరిహారం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందించామని, వారి పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని తెలిపారు. మరణించిన నలుగురికి పోస్టుమార్టం నిర్వహించామని, మిగతా 30 మంది ఇంటికి మెడికల్ టీమ్ పంపి చెకప్ చేయించామని తెలిపారు. ఏడుగురికి సమస్యలు గుర్తించి అపోలో హాస్పిటల్ కి తరలించామన్న వైద్య శాఖ సంచాలకులు ఈరోజు మరోసారి పరీక్షలు చేసి.. ఇద్దరిని నిమ్స్ కు తరలించామని తెలిపారు. వారికి ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేదన్నారు.

2016 నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు టార్గెట్లు లేవు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, 2021-21లో 1.10 లక్షల ఆపరేషన్లు నిర్వహించామని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు 111 క్యాంపుల్లో 38,656 సర్జరీలు చేశారు. ఇలాంటి ఘటనలు నమోదు కావటం శోచనీయమన్నారు. ఘటనపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. DH నేతృత్వంలోని 5 మంది నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసిందన్నారు. 7 రోజుల్లో నివేదిక ఇస్తామని, ఇబ్రహీంపట్నం PHC హాస్పిటల్ సూపరింటెండెంట్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మెడికల్ కౌన్సిల్ సర్జరీ చేసిన డాక్టర్ లైసెన్స్ ను తాత్కాలికంగా రద్దు చేసింది. మరణాలకు కారణం ఏమిటో పరిశోధన తర్వాతే తెలుస్తుందని, కేంద్రం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే ఆపరేషన్లు. శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. ఇకపై సర్జరీల సమయంలో నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూస్తామని వైద్య శాఖ సంచాలకులు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్