Saturday, January 18, 2025
Homeసినిమానిదానంగా సాగే 'IC 814 ద కాందహార్ హైజాక్'

నిదానంగా సాగే ‘IC 814 ద కాందహార్ హైజాక్’

నెట్ ఫ్లిక్స్ నుంచి ఎప్పటికప్పుడు భారీ వెబ్ సిరీస్ లు వస్తూ ఉంటాయి. అలాగే ఆగస్టు 29వ తేదీన ‘IC 814 ద కాందహార్ హైజాక్’ అనే సిరీస్ ను వదిలారు. అనుభవ సిన్హా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 6 ఎపిసోడ్స్ తో వచ్చింది. ఒక్కో ఎపిసోడ్ నిడివి 40 నిమిషాల వరకూ ఉంది. ఈ సిరీస్ ను కొన్ని విమర్శలు .. వివాదాలు చుట్టు ముట్టాయి. దాంతో అప్పటి వరకూ ఈ సిరీస్ ను చూడనివారు కూడా, ఇప్పుడు అందులో ఏముందో తెలుసుకోవడం కోసం ఫాలో అవుతున్నారు.

1999 డిసెంబర్ 24వ తేదీన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్ కి గురైంది. కాఠ్మండు నుంచి ఢిల్లీ బయల్దేరిన కొంతసేపటికి ఈ ఫ్లైట్ ను ఉగ్రవాదులు హైజాక్ చేస్తారు. 176  ప్రయాణీకులతో ఉన్న ఈ విమానాన్ని హైజాక్ చేయడంలో ఐదుగురు ఉగ్రవాదులు పాల్గొంటారు. ఉగ్రవాదుల చెరలో నుంచి ఈ ఫ్లైట్ బయటపడటానికి వారం రోజులు పడుతుంది. ఈ వారం రోజుల పాటు ఏం జరిగిందనే కథతో ఈ సిరీస్ ను తీర్చిదిద్దారు.

సీనియర్ స్టార్స్ ఈ సిరీస్ లో ప్రధానమైన పాత్రలను పోషించారు. సాధారణంగా ఈ తరహా కథలలో ఒక రకమైన ఆందోళన .. హడావిడి కనిపిస్తూ ఉంటాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఫ్లైట్ లోని ప్రయాణీకులతో పాటు, ఆడియన్స్ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అలాంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయలేకపోవడం ఒక లోపంగా కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వ  ప్రతినిధులు .. సంబంధిత శాఖల అధికారుల మధ్య జరిగే చర్చలను చప్పగా చూపించారు. నిదానంగా సాగే కథాకథనాలను ఒకింత ఓపిక చేసుకుని చూడవలసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్