Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ICC ODI World Cup: అక్టోబర్ 15న ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్

ICC ODI World Cup: అక్టోబర్ 15న ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్

ఐసిసి వన్డే వరల్డ్ కప్-2023 షెడ్యూల్ విడుదలైంది. ఇండియా ఈ మెగా టోర్నీకి  ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే.  అక్టోబర్ 5న ప్రారంభం కానున్న వరల్డ్ కప్ నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది.

అహ్మదాబాద్ లోని నరేంద మోడీ స్టేడియంలో అక్టోబర్ 5న ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ తో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ఇదే స్టేడియంలో దాయాది దేశాలు ఇండియా-పాకిస్తాన్ అక్టోబర్ 15 న తలపడనున్నాయి.

రెండు సెమీ ఫైనల్స్ ముంబై, కోల్ కతాలో జరగనున్నాయి.

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. అక్టోబర్ 6న పాకిస్తాన్ – క్వాలిఫైర్ 1 మధ్య; అక్టోబర్ 9న న్యూ జిలాండ్- క్వాలిఫైర్ 1; అక్టోబర్ 12న పాకిస్తాన్- క్వాలిఫైర్ 2 మధ్య  జరగనున్న మ్యాచ్ లకు హైదరాబాద్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది,

ఇక టీమిండియ విషయానికి వస్తే…

  1. అక్టోబర్ 8న ఆస్ట్రేలియా ( చెన్నై)
  2. అక్టోబర్ 11న  ఆఫ్ఘనిస్తాన్ (ఢిల్లీ)
  3. అక్టోబర్ 15న పాకిస్తాన్ (అహ్మదాబాద్)
  4. అక్టోబర్ 19న బంగ్లాదేశ్ (పూణే)
  5. అక్టోబర్ 22న న్యూ జిలాండ్ (ధర్మశాల)
  6. అక్టోబర్ 29న ఇంగ్లాండ్ (లక్నో)
  7. నవంబర్ 2న క్వాలిఫైర్ 2 (ముంబై)
  8. నవంబర్ 5న సౌతాఫ్రికా (కోల్ కతా )
  9. నవంబర్ 11న క్వాలిఫైర్ 1 (బెంగుళూరు)  ల్లో తలపడనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్