Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్బంగ్లాపై ఇంగ్లాండ్ ఘన విజయం

బంగ్లాపై ఇంగ్లాండ్ ఘన విజయం

టి20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ వరుసగా రెండో విజయం సాధించింది. బంగ్లాదేశ్ తో నేడు జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. బంగ్లాదేశ్ విసిరిన 125 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 14.1  ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ జేసన్ రాయ్ 38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ గా నిలిచాడు.

అబుదాబీలోని షేక్ జాయేద్ స్టేడియంలో జరిగిన నేటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.  జట్టులో ముష్ఫికర్ రహీం-29; కెప్టెన్ మహ్మదుల్లా-19; నసమ్ అహ్మద్-19 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో టైమల్ మిల్స్ మూడు, మొయిన్ అలీ, లివింగ్ స్టోన్ చెరో రెండు, వోక్స్ ఒక వికెట్ పడగొట్టారు.

ఇంగ్లాండ్ ఈ లక్ష్యాన్ని ఆడుతూ, పాడుతూ సాధించింది. జేసన్ రాయ్ -61; జోస్ బట్లర్-18 పరుగులు చేసి ఔటయ్యారు. డేవిడ్ మలన్-28; జానీ బెయిర్ స్టో-8 పరుగులతో అజేయంగా నిలిచాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్