Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్స్కాట్లాండ్ పై నమీబియా గెలుపు

స్కాట్లాండ్ పై నమీబియా గెలుపు

టి­-20 వరల్డ్ కప్ సూపర్-12లో ఆడిన తొలి మ్యాచ్ లో నమీబియా విజయం సాధించింది. నేడు జరిగిన మ్యాచ్ లో స్కాట్లాండ్ పై మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లతో గెలుపొందింది.

అబుదాబీలోని షేక్ జయేద్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో నమీబియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. నమీబియా బౌలర్ రుబెన్ ట్రంపుల్ మ్యాన్ పదునైన బంతులకు మొదటి ఓవర్లోనే స్కాట్లాండ్ మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ జార్జ్ మున్షీ డకౌట్ అయ్యాడు.  మూడో బంతికి  మాక్ లియోడ్, నాలుగో బంతికి  రిచీ బెరింగ్టన్ కూడా సున్నాకే పెవిలియన్ చేరారు. ఓపెనర్ మాథ్యు క్రాస్-19;  మైఖేల్ లీస్క్-44; క్రిస్ గ్రేవ్స్-25 పరుగులతో పర్వాలేదనిపించారు. దీనితో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది.

లక్ష్య ఛేదనలో నమీబియా నింపాదిగా ఆడింది. స్కాట్లాండ్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌల్ చేయడంతో పరుగులు రాబట్టేందుకు బ్యాట్స్ మెన్ ఇబ్బంది పడ్డారు. ఓపెనర్లు క్రెగ్ విలియమ్స్-23; మైఖేల్ వాన్-18 తో పాటు చివర్లో జే జే స్మిత్ 23 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లతో 32 పరుగులతో అజేయంగా నిలిచి విజయాన్ని అందించారు.

నమీబియా బౌలర్ రుబెన్ ట్రంపుల్ మ్యాన్ ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అందుకున్నాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్