Thursday, March 12, 2026
Homeస్పోర్ట్స్ఐసిసి టి 20: పాకిస్తాన్ క్లీన్ స్వీప్

ఐసిసి టి 20: పాకిస్తాన్ క్లీన్ స్వీప్

ICC T20 Wc Pakistan Beat Scotland By 72 Runs :

టి20 వరల్డ్ కప్ సూపర్ 12 లో పాకిస్తాన్ వరుసగా ఐదో మ్యాచ్ లో కూడా విజయం సాధించి సత్తా చాటింది. స్కాట్లాండ్ తో నేడు జరిగిన మ్యాచ్ లో 72  పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు స్కోరు 35 వద్ద ఓపెనర్ రిజ్వాన్(15) ఔటయ్యాడు. ఈ సిరీస్ లో మంచి ఫామ్ కనబరుస్తోన్న కెప్టెన్ బాబర్ ఆజమ్ మరో సారి రాణించాడు, 47 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతో 66 పరుగులు సాధించాడు. మహమ్మద్ హఫీజ్ 31 చేయగా, షోయబ్ మాలిక్ అధ్బుతంగా రాణించి కేవలం 18 బంతుల్లో  1ఫోర్, 6సిక్సర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పాక్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.

భారీ లక్ష్య సాధనలో స్కాట్లాండ్ మరోసారి బోల్తా పడింది. జట్టులో రిచీ బెర్రింగ్టన్ 54 పరుగులతో రాణించాడు. మిగతా వారిలో ఓపెనర్ మున్సీ-17; మైఖేల్ -14 మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. దీనితో స్కాట్లాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేయగలిగింది.

షోయబ్ మాలిక్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

ఈ నెల 11న జరగనున్న సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో పాకిస్తాన్ తలపడనుంది

Must Read : పాకిస్తాన్ కు నాలుగో విజయం

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular