ICC T20 Wc South Africa Beat Bangladesh By 6 wickets :
ఐసీసీ టి-20 వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా మరో విజయాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్ తో నేడు జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో మరో 39 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం చేరుకుంది. అబుదాబీలోని షేక్ జయేద్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా బౌలర్లు మంచి లైన్ అండ్ లెంత్ తో బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్ ఆటగాళ్ళు పరుగులు రాబట్టడానికి ఇబ్బంది పద్దారు. నాలుగో ఓవర్ నుంచి బంగా వికెట్ల పతనం మొదలైంది. కేవలం ముగ్గురు ఆటగాళ్ళు మాత్రమే… ఓపెనర్ లిటన్ దాస్-24; షమీమ్ హుస్సేన్-11; మహేది హాసన్-27… రెండంకెల స్కోరు సాధించారు. నలుగురు ఆటగాళ్ళు డకౌట్ అయ్యారు. దీనితో 18.2 ఓవర్లలో 84 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సౌతాఫ్రికా బౌలర్లలో రబడ, నార్త్జ్ చెరో మూడు; టబ్రైజ్ రెండు; షంసి ఒక వికెట్ పడగొట్టారు.
స్వల్ప లక్ష్యాన్ని త్వరగా చేరుకోవాలనే ఆరాటంలో సౌతాఫ్రికా మొదటి ఓవర్లోనే రీజా(4) వికెట్ కోల్పోయింది. ఐదో ఓవర్లో మరో ఓపెనర్ డికాక్ (16)కూడా ఔటయ్యాడు. వెంటనే మార్ క్రమ్ డకౌట్ అయ్యాడు. డస్సేన్ 22 పరుగులు చేసి నాసం అహ్మద్ బౌలింగ్ లో ఔటయ్యాడు. కెప్టెన్ తింబా-31 (28 బంతుల్లో 3 ఫోర్లు 1సిక్సర్); డేవిడ్ మిల్లర్ 5 కలిసి మరో వికెట్ పడకుండా ఆడి జట్టును గెలిపించారు.
నాలుగు ఓవర్లలో 20 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీసిన సౌతాఫ్రికా బౌలర్ రబడ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
Must Read :పాకిస్తాన్ కు నాలుగో విజయం